News September 14, 2025
విజయవాడ: పండుగ వేళ ప్రత్యేక రైళ్లు

దసరా, దీపావళి సందర్భంగా విజయవాడ మీదుగా చెన్నై సెంట్రల్(MAS), బరౌని(BJU) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.06039 MAS-BJU ట్రైన్‌ను నేటి నుంచి NOV 30 వరకు ప్రతి ఆదివారం, నం.06040 BJU-MAS ట్రైన్‌ను SEPT 17 నుంచి DEC 3 వరకు ప్రతి బుధవారం నడుపుతామన్నారు. ఈ ట్రైన్లు ఏపీలో విజయవాడ, శ్రీకాకుళం రోడ్, విజయనగరం, రాజమండ్రితో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.
Similar News
News September 14, 2025
కర్నూలు: ‘ప్రతి ఒక్కరు వ్యాయామం చేయాలి’

ప్రతి ఒక్కరు వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ‘సండేస్ ఆన్ సైక్లింగ్’ కార్యక్రమాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. సైక్లింగ్ వల్ల పర్యావరణానికి ముప్పు ఉండదని, ప్రతి ఆదివారం పోలీసులు సైకిల్ తొక్కాలని పిలుపునిచ్చారు.
News September 14, 2025
పటాన్‌చెరు: 18న జిల్లా స్థాయి చెస్ ఎంపికలు

పటాన్‌చెరులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో జిల్లా స్థాయి చెస్ అండర్- 14, 17 ఎంపికలు నిర్వహిస్తున్నట్లు స్కూల్ గేమ్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. అండర్- 14కు 1-1-2012, అండర్-17కు 1-1-2009 తర్వాత జన్మించిన వారు అర్హులని చెప్పారు. పూర్తి వివరాలకు 9849531989, 9505796688 నంబర్లకు సంప్రదించాలని కోరారు.
News September 14, 2025
జగిత్యాల: ఉరివేసుకుని ఇంటర్ విద్యార్థిని మృతి

జగిత్యాల జిల్లా మల్యాల మండలం రామన్నపేట గ్రామానికి చెందిన ఒడిగే హారిక(17) ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. హారిక ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతున్నట్లు తెలిసింది. కాగా, విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.