News September 14, 2025

ములుగు: బుల్లెట్ బండిపై SP, మంత్రి సీతక్క..!

image

మంత్రిననే హోదాను పక్కనబెట్టి సాధారణ వ్యక్తిగా వ్యవహరించడం సీతక్క నైజం. ఎప్పుడూ ప్రజల మధ్య ఉండే ఆమె ఆర్భాటాలకు దూరంగా ఉంటారు. ఆదివారం మేడారం జాతర పనుల పర్యవేక్షణకు వెళ్లిన మంత్రి ములుగు SP శబరీష్ బుల్లెట్ బైక్ నడుపుతుండగా వెనుక కూర్చొని జాతర జరిగే పరిసరాలను పరిశీలించారు. రోడ్లు, పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్ ఏర్పాట్లపై సమీక్షించారు. జాతర నిర్వహణకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News September 14, 2025

గచ్చిబౌలిలో గోడ కూలి ఒకరు మృతి.. నలుగురికి గాయాలు

image

గచ్చిబౌలి పీఎస్ పరిధిలోని వట్టినాగులపల్లిలో ప్రమాదం జరిగింది. గోడ కూలి ఒకరు మృతి చెందగా నలుగురికి గాయాలయ్యాయి. స్థానికంగా కొత్తగా నిర్మిస్తున్న నూతన కన్వెన్షన్ సెంటర్‌కి చెందిన ప్రహరీ కూలి అక్కడే పని చేస్తున్న కూలీలపై పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

కృష్ణాజిల్లా టుడే టాప్ న్యూస్

image

☞ మచిలీపట్నం ఎంపీకి మూడవ ర్యాంక్
☞ జగన్ ఓ డ్రామాల కింగ్: ఎంపీ
☞ గన్నవరం విమానాశ్రయంలో కనకదుర్గమ్మ దివ్య దర్శనం
☞ మోపిదేవి: సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయంలో భక్తుల రద్దీ
☞ కృష్ణాజిల్లా ఎస్పీ నేపథ్యం ఇదే.!  
☞ గన్నవరం ఎయిర్పోర్ట్ బోర్డు విషయంలో ఎమ్మెల్యే అసంతృప్తి
☞ గన్నవరం: హాస్టల్ వంట మనిషిపై విద్యార్థుల దాడి