News September 14, 2025

ఎటెండెన్స్‌లో VZM ఎంపీకి ఫస్ట్ ర్యాంక్

image

లోక్ సభలో ఎంపీల పెర్ఫామెన్స్‌ రిపోర్ట్‌ను పార్లమెంట్ విడుదల చేసింది. 2024 జూన్ 24 నుంచి 2025 ఏప్రిల్ 4వ తేదీ వరకు ఎంపీలు పాల్గొన్న డిబెట్‌లు, అడిగిన క్వశ్చన్స్, ఎటెండెన్స్ ఆధారంగా ఈ ర్యాంక్‌లను ఇచ్చింది. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు క్వశ్చన్స్, ఎటెండెన్స్‌ కేటగిరీల్లో తొలిస్థానంలో నిలిచారు. ఓవరాల్ ర్యాంక్‌‌లో ఫోర్త్ ప్లేస్ వచ్చింది.

Similar News

News September 14, 2025

యాదాద్రిలో మంత్రి జూపల్లి ప్రత్యేక పూజలు

image

మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం దర్భాలయంలో స్వయంభూ నరసింహుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు అష్టోత్తర పూజ జరిపి, మంత్రికి ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు ప్రసాదాలను అందజేశారు.

News September 14, 2025

2 కీలక వికెట్లు కోల్పోయిన భారత్

image

పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచులో టీమ్ ఇండియా ఓపెనర్లు ఔటయ్యారు. గిల్ 10 రన్స్ చేసి స్టంపౌట్ అయ్యారు. అభిషేక్ శర్మ 2 సిక్సర్లు, 4 ఫోర్లతో రఫ్పాడించారు. అదే జోరులో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ దగ్గర క్యాచ్ ఇచ్చారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 4 ఓవర్లలో 42/2గా ఉంది. సూర్య సేన విజయానికి మరో 86 పరుగులు అవసరం.

News September 14, 2025

మక్తల్: ఉపాధ్యాయుల మానసిక ఉల్లాసానికి క్రీడల అవసరం: DYSO

image

ఉపాధ్యాయుల మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరమని DYSO శెట్టి వెంకటేష్ అన్నారు. మక్తల్ పట్టణంలో మినీ స్టేడియంలో ఆదివారం నియోజకవర్గస్థాయి ఉపాధ్యాయుల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో కృష్ణ, మాగనూర్, నర్వ, మక్తల్, ఊట్కూర్ మండలాల ఉపాధ్యాయులు మ్యాచ్‌లో పాల్గొన్నారు. ఫైనల్లో ఊట్కూరు ఉపాధ్యాయులు మ్యాచ్‌లో విజయం సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు.