News September 14, 2025

నరసరావుపేట ఎంపీకి మెదటి ర్యాంక్

image

2024-25వ సంవత్సరానికి సంబంధించి లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ ఎంపీల పనితీరు నివేదికను పార్లమెంట్ ప్రతినిధులు ఆదివారం విడుదల చేశారు. ఈ నివేదికలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మెదటి స్థానంలో నిలిచారు. ఆయన లోక్‌సభలో మొత్తం 67 ప్రశ్నలు అడగటంతో పాటు 22 చర్చల్లో పాల్గొన్నారు. ఆయన హాజరు శాతం 83.82గా ఉంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకును కేటాయించినట్లు పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి.

Similar News

News September 14, 2025

2 కీలక వికెట్లు కోల్పోయిన భారత్

image

పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచులో టీమ్ ఇండియా ఓపెనర్లు ఔటయ్యారు. గిల్ 10 రన్స్ చేసి స్టంపౌట్ అయ్యారు. అభిషేక్ శర్మ 2 సిక్సర్లు, 4 ఫోర్లతో రఫ్పాడించారు. అదే జోరులో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ దగ్గర క్యాచ్ ఇచ్చారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 4 ఓవర్లలో 42/2గా ఉంది. సూర్య సేన విజయానికి మరో 86 పరుగులు అవసరం.

News September 14, 2025

మక్తల్: ఉపాధ్యాయుల మానసిక ఉల్లాసానికి క్రీడల అవసరం: DYSO

image

ఉపాధ్యాయుల మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరమని DYSO శెట్టి వెంకటేష్ అన్నారు. మక్తల్ పట్టణంలో మినీ స్టేడియంలో ఆదివారం నియోజకవర్గస్థాయి ఉపాధ్యాయుల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో కృష్ణ, మాగనూర్, నర్వ, మక్తల్, ఊట్కూర్ మండలాల ఉపాధ్యాయులు మ్యాచ్‌లో పాల్గొన్నారు. ఫైనల్లో ఊట్కూరు ఉపాధ్యాయులు మ్యాచ్‌లో విజయం సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు.

News September 14, 2025

పార్వతీపురం: రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక

image

పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ స్థానిక గవర్నమెంట్ హై స్కూల్లో జూనియర్ కబడ్డీ విభాగంలో ఎంపికలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి పాల్గొన్న క్రీడాకారుల్లో 14 మంది బాలికలు,14 మంది బాలురు ఎంపిక అయ్యారని, వీరందరూ ఈనెల 24 నుంచి 28 వరకు NTR జిల్లా గొల్లపూడిలో జరగనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో జిల్లా తరఫున పాల్గొంటారని జిల్లా కబడ్డీ సంఘం సెక్రటరీ వెన్నపు చంద్రరావు తెలిపారు.