News September 14, 2025
లోక్ అదాలత్‌లో 1,466 కేసులకు పరిష్కారం: కిరణ్ ఖరే

భూపాలపల్లి జిల్లాలో జాతీయ మెగా లోక్ అదాలత్ విజయవంతమైంది. ఈ అదాలత్‌లో మొత్తం 1,466 కేసులు రాజీ మార్గంలో పరిష్కారమైనట్లు ఎస్పీ కిరణ్ ఖరే ఆదివారం వెల్లడించారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన ఐపీసీ, బీఎన్‌ఎస్, సైబర్ క్రైమ్, డీడీ, ఎంవీ యాక్ట్‌కు సంబంధించిన కేసులను పరిష్కరించామని ఎస్పీ తెలిపారు. రాజీ మార్గమే రాజమార్గమనే భావన ఉండాలని అన్నారు.
Similar News
News September 15, 2025
బిగ్ బాస్: ఈ వారం ఎలిమినేట్ ఎవరంటే?

తెలుగు బిగ్‌బాస్ సీజన్-9లో తొలి వారం శ్రష్ఠి వర్మ ఎలిమినేట్ అయ్యారు. ఆమెను ఎలిమినేట్ చేసినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. దీంతో నామినేషన్స్‌లో ఉన్న నటి ఫ్లోరా సైనీ, సుమన్ శెట్టి, రీతూ చౌదరి సేఫ్ జోన్‌లోకి చేరుకున్నారు. వీళ్లు హౌస్‌లోనే కొనసాగనున్నారు. కొరియోగ్రాఫర్ అయినా శ్రష్ఠి ఈ సీజన్‌లో సెలబ్రిటీ కోటాలో హౌస్‌లోకి వెళ్లారు.
News September 15, 2025
నా మెదడు నెలకు రూ.200 కోట్లు సంపాదించగలదు: గడ్కరీ

ఇథనాల్ పెట్రోల్ విషయంలో తాను అవినీతికి పాల్పడుతున్నట్లు వస్తున్న ఆరోపణలను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఖండించారు. ‘నాకు షుగర్ ఫ్యాక్టరీ, డిస్టిలరీ, పవర్ ప్లాంట్ ఉన్నాయి. నా ఆదాయం పుష్కలంగా ఉంది. నా మెదడు నెలకు రూ.200 కోట్లు సంపాదించగలదు. నాకు దిగజారే అవసరం లేదు’ అని నాగ్‌పుర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో తెలిపారు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని వెల్లడించారు.
News September 14, 2025
యాదాద్రిలో మంత్రి జూపల్లి ప్రత్యేక పూజలు

మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం దర్భాలయంలో స్వయంభూ నరసింహుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు అష్టోత్తర పూజ జరిపి, మంత్రికి ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు ప్రసాదాలను అందజేశారు.