News September 14, 2025
ఉమ్మడి గుంటూరు జిల్లాలో నేటి వర్షపాతం వివరాలు

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆదివారం నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ వెల్లడించింది. సాయంత్రం 5 గంటల నాటికి గుంటూరులో 81మిమీ, గుంటూరు జిల్లా వంగిపురంలో 39.5మిమీ వర్షపాతం నమోదైందని చెప్పారు. పల్నాడు జిల్లా తుర్లపాడులో 54.5 మిమీ, పెదకూరపాడులో 40.2 మిమీ, చొప్పున వర్షపాతం నమోదైందన్నారు. వర్షం కురిసే సమయంలో చెట్ల కింద ఉండకూడదని వెల్లడించారు.
Similar News
News September 15, 2025
MLG: రెండేళ్లకు న్యాయం.. బాధితుడికి రూ.కోటి పరిహారం

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వెంకటాపురంవాసి భూపతి దీక్షిత్(22)కు ఎట్టకేలకు న్యాయం లభించింది. 2023 AUG 12న జరిగిన యాక్సిడెంట్‌లో దీక్షిత్ తలకు బలమైన గాయమై శరీరం చచ్చుబడింది. ఈ క్రమంలో గో డిజిట్ ఇన్సూరెన్స్ సంస్థ నుంచి తమకు కోటిన్నర పరిహారం ఇప్పించాలని బాధిత కుటుంబీకులు కేసు వేశారు. కాగా, శనివారం జరిగిన లోక్ అదాలత్‌లో కేసు విచారించిన జడ్జ్ బాధితుడికి అనుకూలంగా రూ.కోటి చెల్లించాలని తుది తీర్పును ఇచ్చారు.
News September 15, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 15, సోమవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.52 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.04 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.11 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.35 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.18 గంటలకు
✒ ఇష: రాత్రి 7.31 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News September 15, 2025
మెట్‌పల్లి: డిగ్రీ అడ్మిషన్లకు మరో అవకాశం

మెట్‌పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరేందుకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు ప్రిన్సిపల్ వెంకయ్య తెలిపారు. 2025-26 ఏడాదికి కళాశాలలోని BA, B.COM కోర్సుల్లో మిగిలిన సీట్లు భర్తీ చేసేందుకు దోస్త్ ద్వారా ఇవాళ, రేపు చేరేందుకు అవకాశముందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలతో రావాలన్నారు. రిజర్వేషన్ల ఆధారంగా భర్తీ ఉంటుందన్నారు.