News September 14, 2025
MHBD: ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్

రేపు నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదివారం తెలిపారు. జిల్లాస్థాయి అధికారులందరూ యూరియా పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
Similar News
News September 15, 2025
సెప్టెంబర్ 15: చరిత్రలో ఈరోజు

1861: ప్రఖ్యాత ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య(ఫొటోలో) జననం
1892: గదర్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు పృథ్వీసింగ్ ఆజాద్ జననం
1942: నటుడు సాక్షి రంగారావు జననం
1967: ప్రముఖ నటి రమ్యకృష్ణ జననం
1972: ప్రముఖ డైరెక్టర్ కె.వి.రెడ్డి మరణం
*జాతీయ ఇంజినీర్ల దినోత్సవం
*అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం
News September 15, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News September 15, 2025
MLG: రెండేళ్లకు న్యాయం.. బాధితుడికి రూ.కోటి పరిహారం

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వెంకటాపురంవాసి భూపతి దీక్షిత్(22)కు ఎట్టకేలకు న్యాయం లభించింది. 2023 AUG 12న జరిగిన యాక్సిడెంట్‌లో దీక్షిత్ తలకు బలమైన గాయమై శరీరం చచ్చుబడింది. ఈ క్రమంలో గో డిజిట్ ఇన్సూరెన్స్ సంస్థ నుంచి తమకు కోటిన్నర పరిహారం ఇప్పించాలని బాధిత కుటుంబీకులు కేసు వేశారు. కాగా, శనివారం జరిగిన లోక్ అదాలత్‌లో కేసు విచారించిన జడ్జ్ బాధితుడికి అనుకూలంగా రూ.కోటి చెల్లించాలని తుది తీర్పును ఇచ్చారు.