News September 14, 2025

8 వికెట్లు తీసిన భారత్

image

పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచులో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. తొలి రెండు ఓవర్లలోనే ఓపెనర్లను ఔట్ చేయగా జమాన్(17), కెప్టెన్ సల్మాన్‌(3)ను అక్షర్ పెవిలియన్ పంపారు. ఇన్నింగ్స్ 12 ఓవర్లో కుల్దీప్ వరుస బంతుల్లో హసన్(5), మహ్మద్ నవాజ్(0)ను ఔట్ చేశారు. 17.4 ఓవర్లలో పాక్ స్కోరు 97/8.

Similar News

News September 15, 2025

చలికాలం మరింత చల్లగా ఉండనుంది: నిపుణులు

image

అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. లా నినా వల్ల చలి తీవ్రంగా ఉంటుంది అంటున్నారు. ఎల్‌ నినో దక్షిణ ఆసిలేషన్ సైకిల్‌లో శీతల దశైన లా నినా.. భూమధ్య రేఖ పసిఫిక్‌లో సముద్ర ఉష్ణోగ్రతలను తగ్గిస్తుంది అంటున్నారు. దాంతో వాతావరణంపై ప్రభావం ఉండనుంది. భారత్‌లో గతంలో కంటే చలి అధికంగా ఉంటుందని చెబుతున్నారు. తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తున్నారు.

News September 15, 2025

‘మిరాయ్’ మూవీని వదులుకున్న నాని!

image

తేజా సజ్జ హీరోగా తెరకెక్కిన ‘మిరాయ్’ మూవీని తొలుత నేచురల్ స్టార్ నానికి డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని వినిపించారని తెలుస్తోంది. ‘కథ విన్న వెంటనే నాని ఒప్పుకున్నారు. కానీ రెమ్యునరేషన్ విషయంలో విభేదాలు రావడంతో ఆయన ఈ మూవీని వదులుకున్నారు’ అని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత తేజాకు ఈ కథ చెప్పగా.. వెంటనే ఒప్పేసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కొల్లగొడుతోంది.

News September 15, 2025

భారత్‌కు ఇబ్బందులు తప్పవు: US మంత్రి

image

ఏకపక్షంగా వెళ్తే భారత్‌కు వాణిజ్యం విషయంలో కష్టాలు తప్పవని US మంత్రి హోవార్డ్ లుట్నిక్ నోరు పారేసుకున్నారు. ‘భారత్ 140 కోట్లమంది జనాభా ఉందని గొప్పలు చెప్పుకుంటుంది. మరి మా మొక్కజొన్నలు ఎందుకు కొనరు? భారత్-US సంబంధాలు ఏకపక్షంగా ఉన్నాయి. విక్రయాలతో ప్రయోజనాలు పొందుతారు. మమ్మల్ని మాత్రం అడ్డుకుంటారు. మేము ఏళ్ల తరబడి తప్పు చేశాం. అందుకే ఇప్పుడు సుంకాల రూపంలో చర్యలు తీసుకున్నాం’ అని తెలిపారు.