News September 14, 2025
మక్తల్: ఉపాధ్యాయుల మానసిక ఉల్లాసానికి క్రీడల అవసరం: DYSO

ఉపాధ్యాయుల మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరమని DYSO శెట్టి వెంకటేష్ అన్నారు. మక్తల్ పట్టణంలో మినీ స్టేడియంలో ఆదివారం నియోజకవర్గస్థాయి ఉపాధ్యాయుల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో కృష్ణ, మాగనూర్, నర్వ, మక్తల్, ఊట్కూర్ మండలాల ఉపాధ్యాయులు మ్యాచ్‌లో పాల్గొన్నారు. ఫైనల్లో ఊట్కూరు ఉపాధ్యాయులు మ్యాచ్‌లో విజయం సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు.
Similar News
News September 15, 2025
మీకోసం వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చు: కలెక్టర్

పార్వతీపురం మన్యం జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోమవారం PGRS నిర్వహించాలని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి కార్యాలయంలో ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరించాలన్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్‌లో ప్రతిరోజూ వినతులు స్వీకరిస్తామన్నారు. అర్జీదారులు పెట్టిన దరఖాస్తు వివరాలను 1100 నంబర్‌కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చునని వెల్లడించారు.
News September 15, 2025
సమ్మె విరమించమని కోరాం: భట్టి

TG: ప్రైవేటు కళాశాలలు <<17708995>>బందు<<>>కు పిలుపునిచ్చిన నేపథ్యంలో యాజమాన్యాలతో Dy.CM భట్టి విక్రమార్క అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు. ‘చర్చలు సానుకూలంగా సాగాయి. సమస్యలు అర్థం చేసుకున్నాం. సోమవారం ప్రభుత్వ పరంగా ఓ నిర్ణయం తీసుకుంటాం. అప్పటి వరకు సమ్మె విరమించాలని కోరాం. వారు సానుకూలంగా స్పందించారు’ అని తెలిపారు. బంద్ నిర్ణయంలో కళాశాలలు వెనక్కి తగ్గట్లేదని తెలుస్తోంది. ఇవాళ మ.3 గం.కు మరోసారి చర్చలు జరగనున్నాయి.
News September 15, 2025
పోచారం ప్రాజెక్టులో నీట మునిగి యువకుడి మృతి

నాగిరెడ్డిపేట్(M) పోచారం ప్రాజెక్టులో నీట మునిగి ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఎస్సై భార్గవ్ గౌడ్ వివరాలు.. మెదక్‌కు చెందిన షేక్ మహబూబ్(20) తన స్నేహితునితో కలిసి ప్రాజెక్టు దిగువన ఈత కొట్టేందుకు నీటిలో దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో షేక్ మహబూబ్ నీట మునిగిపోయాడు. పోలీసులు చేరుకొని గజ ఈతగాళ్లతో మృతదేహాన్ని బయటకు తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.