News September 15, 2025
BREAKING: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం

ASIA CUP-2025: పాకిస్థాన్‌ను భారత్ చిత్తు చేసింది. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత పాకిస్థాన్ 127/9 పరుగులు చేసింది. అనంతరం భారత్ వేగంగా ఆడి 15.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (13 బంతుల్లో 31), సూర్యకుమార్ యాదవ్ 47*, తిలక్ వర్మ 31 రాణించారు. భారత్ తన తర్వాతి మ్యాచ్ ఈ నెల 19న ఒమన్‌తో ఆడనుంది.
Similar News
News January 17, 2026
నోబెల్ బహుమతి కోసం ఇంత పిచ్చా: కైలాశ్ సత్యార్థి

US అధ్యక్షుడు ట్రంప్ ఎట్టకేలకు <<18868941>>మరియా మచాడో<<>> నుంచి నోబెల్ ప్రైజ్ అందుకున్న విషయం తెలిసిందే. ఇది తనను షాక్‌కు గురి చేసిందని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి చెప్పారు. ‘పీస్ ప్రైజ్ కోసం ఇంత పిచ్చిగా ఉన్న వ్యక్తిని ఎన్నడూ చూడలేదు. అవార్డును బదిలీ చేయలేమని <<18821416>>నోబెల్ కమిటీ<<>> చెప్పినట్లు వార్తలొచ్చాయి’ అని జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌లో అన్నారు. 2014లో సత్యార్థి నోబెల్ అందుకున్నారు.
News January 17, 2026
అమరావతి రైతులకు ఒకేచోట ప్లాట్లు!

AP: అమరావతి రైతులకు వేర్వేరు చోట్ల ప్లాట్లు ఇవ్వడంతో వాటిని అభివృద్ధి చేయడం ప్రభుత్వానికి సమస్యగా మారింది. చాలా ఖర్చుతో కూడుకుని వారికి అప్పగించడం ఆలస్యమైంది. దీంతో 2వ విడత 20,494 ఎకరాలు సేకరిస్తున్న ప్రాంతంలో రైతులకు ఒకే చోట ప్లాట్లు కేటాయించాలని భావిస్తోంది. ఇలా ఇవ్వడం వల్ల CRDAకి అందే స్థలమూ ఒకే ప్రాంతంలో ఉండి సంస్థలకు కేటాయింపులో మధ్యలో అడ్డంకులు ఉండవని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.
News January 17, 2026
మరోసారి ముంబైని చిత్తు చేసిన యూపీ

WPL-2026: ముంబైపై మరోసారి యూపీ వారియర్స్ సత్తా చాటింది. ఇవాళ 22 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత యూపీ 187/8 రన్స్ చేయగా.. ముంబై 165 పరుగులకే పరిమితమైంది. యూపీ కెప్టెన్ లానింగ్ 45 బంతుల్లో 70 రన్స్‌తో రాణించారు. కాగా జనవరి 15న కూడా ముంబైపై యూపీ గెలిచిన సంగతి తెలిసిందే.


