News September 15, 2025
NLG: యూరియాను పక్కదారి పట్టించిన MLA గన్మెన్..?

రైతుల యూరియాను ఓ గన్మెన్ పక్కదారి పట్టించిన ఘటన NLG జిల్లాలో కలకలం రేపుతోంది. MLG ఎమ్మెల్యే BLR గన్‌మెన్ రైతుల కోసం వచ్చిన యూరియా లారీని అతనికి కావాల్సిన వారి కోసం దారి మళ్లించారు. ఎమ్మెల్యే పీఏ అని చెప్పుకుంటూ ఈ వ్యవహారం నడిపినట్లు సమాచారం. విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఎస్పీ చర్యలకు ఉపక్రమించారు.
Similar News
News September 15, 2025
రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులు వర్షాలు!

AP: అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో రాబోయే 4 రోజులు రాష్ట్రంలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అవకాశముందని APSDMA తెలిపింది. ఇవాళ అల్లూరి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, NTR, GNT, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో మోస్తరు వానలు కురిసే ఛాన్సుందని పేర్కొంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడతాయంది.
News September 15, 2025
సిద్దిపేట: నూరేళ్ల వేడుక.. నాలుగు తరాలు

సిద్దిపేట జిల్లా ఇమాంబాద్‌కు చెందిన నిమ్మల రాములు నూరేళ్ల వేడుకలో నాలుగు తరాల అనుబంధం వెల్లివిరిసింది. ఏడుగురు కుమార్తెలు, కుమారుడు, వారి సంతానంతో కలిపి మొత్తం 68 మంది కుటుంబ సభ్యులు ఒకేచోట చేరి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ అరుదైన దృశ్యం చూసిన రాములు ఆనందంతో కళ్లు చెమర్చాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత పెద్ద కుటుంబం ఒకేచోట చేరడం విశేషం. ఈ అపూర్వ ఘట్టం ఆ ఇంట్లో పండుగ వాతావరణాన్ని తలపించింది.
News September 15, 2025
నేడు మెగా డీఎస్సీ తుది జాబితా విడుదల

AP: ఇవాళ మెగా DSC తుది ఎంపిక జాబితా విడుదలకానుంది. అధికారిక వెబ్‌సైట్, జిల్లా విద్యాధికారి, కలెక్టర్ కార్యాలయాల్లోనూ రిజల్ట్ అందుబాటులో ఉంచనున్నారు. 16,347 ఉపాధ్యాయ పోస్టులకుగానూ జూన్ 6 నుంచి జులై 2 వరకు రెండు విడతలుగా ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించారు. జులై 5న ప్రాథమిక కీ, ఆగస్టు 1న ఫైనల్ కీ విడుదలైంది. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కూడా పూర్తైంది. ఈనెల 19న అమరావతిలో అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తారు.