News April 4, 2024

ఓయూను ప్రభుత్వం ఆదుకోవాలి: VC

image

HYD ఉస్మానియా యూనివర్సిటీ 2024-25 వార్షిక బడ్జెట్ రూ.718.86 కోట్లు కాగా అంచనా వ్యయం రూ.796.45 కోట్లు, లోటు బడ్జెట్ రూ.44.68 కోట్లుగా ఉందని వీసీ రవీందర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బ్లాక్ గ్రాంట్స్ రూపంలో రూ.487.03 కోట్లు కేటాయించినప్పటికీ బడ్జెట్ లోటును పూడ్చడానికి, వర్సిటీలో కార్యకలాపాలు సజావుగా సాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని అదనపు గ్రాంట్లు అందించి వర్సిటీని ఆదుకోవాలని కోరారు.

Similar News

News September 10, 2025

కర్మన్‌ఘాట్ గుడి పులిహోర వివాదం.. EO వివరణ

image

కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయంలో కుళ్లిన <<17658707>>పులిహోర ప్రసాదం<<>> పంపిణీ అయిందన్న వార్తల్లో నిజం లేదని ఆలయ EO లావణ్య స్పష్టం చేశారు. రోజూ ప్రసాదం తయారు చేసి అందజేస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిల్వ చేయబోమని తెలిపారు. కొంతమంది కావాలనే ఆలయ ప్రతిష్ఠను, భక్తుల మనోభావాలను దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. దీనిపై కమిటీ విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News September 10, 2025

లివర్ బాధితులకు నిమ్స్ భరోసా.. త్వరలో అత్యాధునిక చికిత్స

image

కాలేయ వ్యాధితో బాధపడుతున్న వారికి నిమ్స్ ఆస్పత్రి భరోసా ఇస్తోంది. త్వరలో అత్యాధునిక ఇంజెక్షన్‌ను అందుబాటులోకి రానుంది. అక్టోబర్ 2 నుంచి ఇది పేషెంట్లకు అందుబాటులో ఉంటుందని నిమ్స్ డైరెక్టర్ నగరి బీరప్ప తెలిపారు. ఎటువంటి సర్జరీ అవసరం లేకుండా కేవలం రీజనరేటివ్ మెడిసిన్‌తో లివర్ పనితీరును మెరుగుపరచవచ్చని డైరెక్టర్ తెలిపారు.

News September 10, 2025

ఇకపై ఓయూ విద్యార్థులకు ఏఐ, ఎంఎల్ నైపుణ్యాలు

image

ఓయూ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు AI, మిషన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్ రంగాలలో నైపుణ్యాలు పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఏఐ లింక్ టెక్నాలజీస్ సంస్థతో ఓయూ ఇంజినీరింగ్ కళాశాల అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. విద్యార్థులను అత్యాధునిక నైపుణ్యాలతో నిపుణులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఇరువర్గాలు ఒప్పందంపై సంతకాలు చేశారు. JNTUHలో ఇప్పటికే ఈ పద్ధతిలో బోధిస్తున్నారు.