News April 4, 2024

పుల్లారెడ్డికి నివాళి అర్పించిన రేవంత్ రెడ్డి

image

నారాయణపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జీ శివకుమార్ రెడ్డి తండ్రి, ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డి తాత పుల్లారెడ్డి దశదిన కర్మ కార్యక్రమం గురువారం హైదరాబాద్లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్యేలు హాజరై పుల్లారెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

Similar News

News January 12, 2026

కేటీఆర్ పాలమూరు పర్యటన షెడ్యూల్ ఇదే..!

image

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం మహబూబ్‌నగర్‌లో పర్యటించనున్నారు. HYD నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి MBNRకు చేరుకుంటారు. 11 గంటలకు పట్టణంలోని పిస్తా హౌస్ నుంచి ఎంబీసీ గ్రౌండ్ వరకు నిర్వహించే బైక్ ర్యాలీలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు జిల్లాలో నూతనంగా ఎన్నికైన పార్టీ మద్దతుదారులు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లను కేటీఆర్ సన్మానించనున్నారు.

News January 12, 2026

మహబూబ్‌నగర్: కరెంట్ షాక్‌తో రైతు మృతి

image

కోయిల్‌కొండ మండలంలోని పారుపల్లిలో పొలంలో విద్యుత్ తీగలు సరి చేసేందుకు వెళ్లి ఓ రైతు మృతి చెందాడు. ఎస్ఐ తిరుపాజీ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎల్లపు తిరుపతయ్య (47) బోర్‌కు విద్యుత్ సరఫరా కావడం లేదని ట్రాన్స్‌ఫార్మ‌ర్ వద్దకు వెళ్లాడు. అక్కడ విద్యుత్ తీగలను సరి చేసేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కొట్టింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

News January 11, 2026

పాలమూరుకు రానున్న సీఎం రేవంత్ రెడ్డి

image

సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 17న పాలమూరుకు రానున్నారు. ఇటీవల MLA శ్రీనివాస్ రెడ్డి CMను కలిసి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు రావాల్సిందిగా కోరారు. ఈ నేపథ్యంలో సీఎం సానుకూలంగా స్పందించడంతో పర్యటన ఖరారైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. MBNR మున్సిపల్ కార్పొరేషన్‌లో రూ.12 వేల కోట్ల అంచనాలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారని ఎమ్మెల్యే చెప్పారు.