News September 15, 2025

ఐజిని కలిసిన పల్నాడు ఎస్పీ

image

పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన బి. కృష్ణారావు ఆదివారం గుంటూరు ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఐజీ మాట్లాడుతూ.. సమర్థవంతంగా విధులు నిర్వహించాలని, ప్రజల్లో పోలీసుల పట్ల విశ్వసనీయత పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నేరాల నియంత్రణకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ఐజీ త్రిపాఠి అన్నారు.

Similar News

News September 15, 2025

అల్లూరి: తుపాకీనే కాదు.. ‘కాటా’ కూడా కంపల్సరీ!

image

సాధారణంగా పోలీసుల విధుల్లో భాగంగా తుపాకీ తీసుకెళ్తుంటారు. కానీ అల్లూరి జిల్లాలో పోలీసులకు మాత్రం తుపాకీతో అదనపు బరువు ఒకటి తోడైంది. అదే వేయింగ్ మెషీన్. ఎందుకంటారా? ఏజెన్సీలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్న తరుణంలో ఎప్పటికప్పుడు తనిఖీల్లో పట్టుబడ్డ గంజాయిని అక్కడికక్కడే తూకం వేయాల్సి వస్తోంది. దీంతో వేయింగ్ మెషీన్ తీసుకెళ్లడం వారికి తప్పనిసరి అయింది.

News September 15, 2025

మేడ్చల్ జిల్లాలోని B.Ed కాలేజీలకు క్యాండిడేట్స్ లాగిన్

image

మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న B.Ed కాలేజీల్లో సీటు పొందిన క్యాండిడేట్స్ వివరాలు తెలుసుకోవడం కోసం ప్రత్యేక లాగిన్ అందుబాటులో ఉంచినట్లుగా ఓయూ అధికారులు తెలిపారు. ఒక్కో కాలేజీలో 20- 30 సీట్ల వరకు ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో క్యాండిడేట్స్ వివరాలతో కూడిన ప్రత్యేక షీట్ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచామన్నారు.

News September 15, 2025

ఉద్దేశపూర్వకంగానే బకాయిల ఎగవేత: కవిత

image

TG: కాంగ్రెస్ కమీషన్ల సర్కారు అమ్మాయిల చదువులను కాలరాస్తోందని కల్వకుంట్ల కవిత ఫైరయ్యారు. కావాలనే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఎగవేస్తోందని దుయ్యబట్టారు. 20% కమీషన్లు ఇస్తేనే బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వంలోని కొందరు డిమాండ్ చేస్తున్నారని కాలేజీల యాజమాన్యాలు ఆవేదన చెందుతున్నాయని ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యం అంటూ గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబిడ్డలను చదువుకు దూరం చేస్తోందని విమర్శించారు.