News September 15, 2025
ఆదిలాబాద్: ఇవాళ, రేపు DEGREEలో SPOT అడ్మిషన్లు

ఈనెల 15,16వ తేదీల్లో మిగిలిపోయిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ఆదిలాబాద్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అతిక్ బేగం పేర్కొన్నారు. బీఏ ఇంగ్లిష్ మీడియం, తెలుగు/ఉర్దూ మీడియంలో సీట్లు కాళీగా ఉన్నాయన్నారు. అలాగే బీకాం తెలుగు/ఇంగ్లిష్ మీడియంలో సీట్లు ఉన్నట్లు తెలియజేశారు. ప్రవేశం పొందగల విద్యార్థులు ఒక సెట్ జిరాక్స్ ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నారు.
Similar News
News February 24, 2026
ఆదిలాబాద్: రూ.1,000 కోట్లు ఎక్కడివి: కేటీఆర్

గాంధీ కుటుంబానికి రూ.1,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధమని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల డబ్బులు తన అయ్యా సొమ్మా అని కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. జిల్లా జైల్లో ఉన్న బాల్క సుమన్‌తో ములాఖత్ అయిన తర్వాత మీడియాతో మాట్లాడారు. రైతులకు రైతు బంధు కోసం డబ్బులు లేవు గానీ, గాంధీ కుటుంబానికి రూ.1,000 కోట్లు ఇచ్చేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. కేంద్ర సంస్థలు ఏమి చేస్తున్నాయన్నారు.
News February 24, 2026
ఆదిలాబాద్: సుమన్‌కు జైలు కొత్త కాదు: కేటీఆర్

మాజీ ఎంపీ, బాల్క సుమన్‌కు జైలులో ఉండటం కొత్తేమీ కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదిలాబాద్ జైలులో ఉన్న బాల్క సుమన్‌తో ములాఖత్ అయ్యాక కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో సుమన్ ఎన్నో సార్లు జైలుకు వెళ్లి వచ్చారన్నారు. జైలులో పెడితే సుమన్ భయపడతారని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటే పొరపాటేనన్నారు.
News February 24, 2026
నేడు ఆదిలాబాద్‌కు కేటీఆర్

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఆదిలాబాద్ జిల్లాకు రానున్నట్లు మాజీ మంత్రి జోగు రామన్న తెలిపారు. ఇటీవల అరెస్టై ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్‌ను 11 గంటలకు ఆయన పరామర్శించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావాలని జోగు రామన్న పిలుపునిచ్చారు.


