News September 15, 2025
ADB: బాల్ బ్యాడ్మింటన్ రాష్ట్ర ఛాంపియన్ షిప్ మనదే!

రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు ఛాంపియన్ షిప్ సాధించిందని బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఆర్. నారాయణ రెడ్డి తెలిపారు. ఈనెల 13, 14వ తేదీల్లో జనగామ జిల్లాలో జరిగిన ఈ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాలుర జట్టు విజయం సాధించి రాష్ట్ర ఛాంపియన్ షిప్ కైవసం చేసుకుంది. ఈ విజయం పట్ల జిల్లా క్రీడాకారులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News September 15, 2025
ప్రెగ్నెన్సీలో డ్రైవింగ్.. సురక్షితమేనా?

చాలామంది గర్భిణులు ఉద్యోగం సహా ఇతర కారణాలతో ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. స్కూటీ, కారును వారే స్వయంగా నడుపుతుంటారు. అయితే డాక్టర్ సలహాతో, గుంతలు లేని రోడ్లపై నెమ్మదిగా డ్రైవింగ్ చేయాలి. నెలలు నిండే కొద్దీ బరువు పెరుగుతారు. కాబట్టి.. ఆ సమయంలో బ్రేక్ వేయటానికి, వాహనం బ్యాలెన్స్ చేయడంలో కొంత ఇబ్బంది ఉంటుంది. వీలైనంత వరకు గర్భంతో ఉన్నప్పుడు డ్రైవింగ్ చేయటం తగ్గించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
News September 15, 2025
HYD: ORRపై యాక్సిడెంట్.. క్షతగాత్రలు వీరే!

సరళ మైసమ్మ ఆలయానికెళ్లి తిరిగి వస్తుండగా అబ్దుల్లాపూర్‌మెట్ PS పరిధి ORRపై <<17713246>>కారు ప్రమాదానికి<<>> గురైంది. సంగారెడ్డి జిల్లా జిన్నారంలోని వావిలాలకు చెందిన R.సౌమ్యరెడ్డి(25), స్నేహితులు నందకిషోర్, వీరేంద్ర, ప్రణీశ్, సాగర్, అరవింద్, జాన్సీ, శ్రుతితోపాటు మొత్తం 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సౌమ్యరెడ్డి, నందకిషోర్‌లను మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా సౌమ్య మరణించిందని CI అశోక్ రెడ్డి తెలిపారు.