News September 15, 2025

నాగమల్లయ్య హత్యపై స్పందించిన ట్రంప్

image

అమెరికాలో భారతీయుడి <<17690207>>తల నరికివేసిన<<>> ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ‘క్యూబాకు చెందిన అక్రమ వలసదారు భార్యాబిడ్డల ముందే చంద్ర నాగమల్లయ్యను కిరాతకంగా చంపేశాడు. అతడు గతంలో నేరాలకు పాల్పడి జైలు శిక్ష అనుభవించాడు. అతడిని క్యూబా తమ దేశంలోకి తీసుకునేందుకు నిరాకరించింది. బైడెన్ అసమర్థతతో జైలు నుంచి బయటకు వచ్చాడు. నేరస్థుడిని కఠినంగా శిక్షిస్తాం. అక్రమ వలసదారులను వదలం’ అని హెచ్చరించారు.

Similar News

News September 15, 2025

స్త్రీ శక్తి పథకంతో మహిళలకు రూ.118 కోట్ల లబ్ధి: మంత్రి

image

AP: నేటితో స్త్రీ శక్తి పథకం(బస్సుల్లో ఉచిత ప్రయాణం) విజయవంతంగా నెల రోజులు పూర్తి చేసుకుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు మహిళలు 3.17 కోట్ల ఉచిత టికెట్లతో ప్రయాణించారని పేర్కొన్నారు. సగటున స్త్రీ శక్తి బస్సులు 90% ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయన్నారు. మహిళా పురుషుల నిష్పత్తి 63:37గా ఉందని వెల్లడించారు. ఈ పథకంలో మహిళలకు నెల రోజుల్లో రూ.118 కోట్ల ఆర్థిక లబ్ధిని చేకూర్చిందని చెప్పారు.

News September 15, 2025

ఆ పూలు పూజకు పనికిరావు!

image

పువ్వుల విషయంలో కొన్ని నియమాలు పాటిస్తే శుభ ఫలితాలు ఉంటాయని పండితులు సూచిస్తున్నారు. ‘కింద పడిన, వాసన చూసిన, ఎడమ చేతితో కోసిన పువ్వులను పూజకు వాడరాదు. ఎడమ చేత్తో, ధరించిన వస్త్రాలలో, జిల్లేడు/ఆముదం ఆకులలో తీసుకొచ్చిన పువ్వులను కూడా ఊపయోగించకూడదు’ అని చెబుతున్నారు. పూజలో పువ్వులను సమర్పించేటప్పుడు మధ్య వేలు, ఉంగరపు వేలు మాత్రమే వాడాలి’ అని అంటున్నారు.

News September 15, 2025

కార్తెలు అంటే ఏంటి?

image

జ్యోతిషులు ఉపయోగించే నక్షత్రాల ఆధారంగా.. రైతులు తమ వ్యవసాయ అవసరాల కోసం రూపొందించుకున్న కాలాన్ని ‘కార్తెలు’ అని అంటారు. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని ఆ నక్షత్రం పేరుతో పిలుస్తారు. అలా మృగశిర కార్తె, చిత్త కార్తె, రోహిణి కార్తె.. వంటివి వస్తాయి. ఈ కార్తెలు సుమారుగా 13-14 రోజులు ఉంటాయి. వీటిని ఉపయోగించి రైతులు వాతావరణ మార్పులను అంచనా వేస్తారు. వ్యవసాయ పనులు చేసుకుంటారు.