News September 15, 2025
తిరుపతిలో డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేస్తా: SP

శాంతి భద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయమని తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఎస్పీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉంచడమే పోలీసుల ధ్యేయమని, 24 గంటల పాటు అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ‘డ్రగ్స్ ఫ్రీ తిరుపతి’ తన లక్ష్యం అన్నారు.
Similar News
News September 15, 2025
సీఎం కాన్ఫరెన్స్‌కు హాజరైన కాకినాడ కలెక్టర్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం నుంచి నిర్వహిస్తున్న రెండు రోజుల కలెక్టర్ల సమావేశానికి కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్ హాజరయ్యారు. ముఖ్యమంత్రి ప్రసంగం తర్వాత జిల్లాకు సంబంధించిన అంశాలపై ఆయన చర్చిస్తారని అధికారులు తెలిపారు. జిల్లా సమస్యలపై సమగ్ర సమాచారాన్ని కలెక్టర్ తీసుకెళ్లారని, వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురానున్నారని సమాచారం.
News September 15, 2025
భద్రాచలంలో పెరుగుతున్న గోదావరి

భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం నీటిమట్టం 37.6 అడుగులకు చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. స్నాన ఘట్టాల వద్ద నీరు చేరడంతో భక్తులు నదిలోకి ప్రవేశించకుండా పోలీసులు బారికేడ్‌లు ఏర్పాటు చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
News September 15, 2025
దులీప్ ట్రోఫీ విజేతగా సెంట్రల్ జోన్

దులీప్ ట్రోఫీ విజేతగా సెంట్రల్ జోన్ జట్టు నిలిచింది. బెంగళూరులో జరిగిన ఫైనల్లో సౌత్ జోన్‌పై ఆ జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచులో సెంట్రల్ జోన్ ప్లేయర్స్ యశ్ రాథోడ్(194), కెప్టెన్ పాటీదార్(101) సెంచరీలతో చెలరేగారు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా సారాన్ష్ జైన్(8 వికెట్లు, 69 రన్స్) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా యశ్ (194, 13 రన్స్) నిలిచారు. స్కోర్లు: సౌత్ జోన్ 149&426, సెంట్రల్ జోన్ 511&66/4.