News September 15, 2025

ఇద్దరు పల్నాడు జిల్లా సీఐలపై సస్పెన్షన్ వేటు

image

గతంలో పల్నాడు జిల్లాలో పని చేసిన ఇద్దరు CI లపై సస్పెన్షన్ వేటు పడింది. 2022 జూన్ 3వ తేదీన దుర్గి (M) జంగమేశ్వరపాడుకు చెందిన TDP నేత జల్లయ్య హత్య కేసులో నిందితులను వదిలేసి అతడి బంధువులను నిందితులుగా పేర్కొంటూ కేసు నమోదు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూటమి సర్కారు విచారణకు ఆదేశించింది. అప్పట్లో మాచర్ల రూరల్ CI షమీముల్లా, కారంపూడి జయకుమార్ కేసు తారుమారు చేశారని ఇద్దరిని సస్పెండ్ చేశారు.

Similar News

News September 15, 2025

ములుగు: రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతి

image

ములుగులోని ప్రేమ్‌నగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. మృతుడు ఏటూరునాగారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న తిప్పనపల్లి శాంతకుమార్ గా గుర్తించారు. రెండు బైకులు ఢీకొవడంతో శాంతకుమార్ అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని మెరుగైన వైద్యం కోసం వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 15, 2025

VJA: దుర్గమ్మ దర్శనానికి దసరా మొబైల్ యాప్, చాట్‌బాట్

image

ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం రూపొందించిన మొబైల్ యాప్, చాట్‌బాట్‌లను దేవదాయ కమిషనర్ రామచంద్ర మోహన్, ఆలయ EO శీనా నాయక్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సేవలు భక్తులకు ఉపయోగపడతాయని తెలిపారు. కాగా ‘దసరా 2025’ పేరుతో యాప్, 9441820717 నంబర్‌తో చాట్‌బాట్ అందుబాటులోకి వచ్చాయి.

News September 15, 2025

కొడంగల్: సీఎం ఇలాకాలో సిమెంట్ ఫ్యాక్టరీ..!

image

సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ మండలంలోని ధర్మాపూర్ పరిసర ప్రాంతాల్లో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సున్నపు నిక్షేపాలు వెలికి తీసేందుకు డ్రిల్లింగ్ చేసి ల్యాబ్‌కు పంపించారు. ధర్మాపూర్, టేకుల్ కోడ్, గండ్లెపల్లి, ఇందనూర్ పరిసర ప్రాంతాల్లోని ఫారెస్టు, ప్రైవేట్, ప్రభుత్వానికి చెందిన మూడు వేల ఎకరాల్లో సిమెంట్ తయారీకి అవసరమయ్యే నిక్షేపాలున్నట్లు అధికారులు గుర్తించారు.