News September 15, 2025
KMR: అత్యధిక వర్షపాతం ఎక్కడంటే!

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా అత్యధిక వర్షపాతం వివరాలు.. సోమూరు 108మి.మీ, మేనూరు 89.5, డోంగ్లి 89.3, వెల్పుగొండ 42.8, తాడ్వాయి 42.5, లచ్చపేట 40, బొమ్మన్ దేవిపల్లి 39.5, బీబీపేట 28.3, భిక్కనూర్ 27, బీర్కూర్ 16.5, బిచ్కుంద 16.3, ఇసాయిపేట 14.3, పాత రాజంపేట 14, మాక్దూంపూర్ 12.3,సర్వాపూర్ 12, దోమకొండ 11.8మి.మీ లుగా నమోదయ్యాయి.
Similar News
News September 15, 2025
‘జిల్లా వ్యాప్తంగా స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం’

పార్వతీపురం జిల్లాలో ఈ నెల 17వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు స్వస్త్ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం జరగనుందని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ రూపొందించిన బ్యానర్లు, పోస్టర్లను సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
News September 15, 2025
రాజమండ్రి: సెప్టెంబర్ 17 నుంచి ఉచిత వైద్య సేవలు

తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం “స్వస్థ నారీ – సశక్త్ పరివార్ అభియాన్” కార్యక్రమానికి సంబంధించిన ప్రచార గోడ ప్రతులను రాజమండ్రిలో జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామమూర్తి ఆవిష్కరించారు. జిల్లాలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించే శిబిరాల ద్వారా మహిళలకు ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు ఆయన తెలిపారు.
News September 15, 2025
AI కంటెంట్‌పై కేంద్రం కీలక నిర్ణయం?

ఏఐ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. ఇకపై ఏఐ జనరేటెడ్ వీడియోలు, ఫొటోలు, ఆర్టికల్స్ అన్నింటికీ కచ్చితంగా లేబుల్ ఉండేలా చర్యలు తీసుకోవాలని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించిన ముసాయిదా రిపోర్టును లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించింది. ఏఐ కంటెంట్ సాధారణ పౌరులతోపాటు వీఐపీలను కూడా అయోమయానికి గురి చేస్తోందని పేర్కొంది.