News April 4, 2024
ఆర్థికవ్యవస్థకు వడదెబ్బ!

ఏటా వేసవికి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు దేశ ఆర్థికవ్యవస్థపై ప్రభావం చూపించొచ్చంటున్నారు నిపుణులు. ‘ఈసారి 10-20రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు రికార్డ్ కానున్న నేపథ్యంలో విద్యుత్, ఆహారం, వ్యాపారం, వడ్డీరేట్లు, GDP వృద్ధిపై ప్రభావం చూపొచ్చు. అధిక ఉష్ణోగ్రతలు పంట దిగుబడిని దెబ్బతీస్తే ఆ ప్రభావం వడ్డీరేట్లపైనా ఉంటుంది. విద్యుత్ కొరత, పరిశ్రమల ఉత్పాదకత తగ్గడం వంటి సవాళ్లు ఎదురవుతాయి’ అని హెచ్చరిస్తున్నారు.
Similar News
News March 15, 2026
102 ఏళ్ల బామ్మ.. రోజూ మద్యం, మాంసం తీసుకుంటూ..

చక్కటి జీవనశైలితోనే ఎక్కువ కాలం జీవిస్తారనే సిద్ధాంతానికి సవాల్ విసురుతున్నారు చైనాకు చెందిన జిన్ బావోలింగ్(102). ఆమె రోజూ పంది మాంసం, కేక్స్, బ్రెడ్స్, బ్రౌన్ షుగర్‌తో కాఫీ, ఆల్కహాల్ తీసుకుంటారు. రోజుకు 15 గంటలు నిద్రపోతారు. కూరగాయలు అరుదుగా తినే బామ్మ ఇప్పటికీ శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నారు. గత 50 ఏళ్లలో ఆస్పత్రి మెట్లు ఎక్కలేదని కుటుంబీకులు చెప్పారు. జిన్ స్టోరీ SMలో వైరలవుతోంది.
News March 15, 2026
మార్చి 31లోపు ఈ పనులు చేయండి!

FY26 ముగిసేలోపు(మార్చి 31) పొదుపు ఖాతాల్లో కనీస మొత్తం డిపాజిట్ చేయాలి. లేదంటే అవి బ్లాక్ అయ్యే ప్రమాదం ఉంది. రీయాక్టివేట్ చేయడానికి ఫైన్ చెల్లించాలి.
* పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో ఏటా కనీసం ₹500 డిపాజిట్ చేయాలి. లేదంటే ₹50 జరిమానా.
* సుకన్య సమృద్ధి యోజన యాక్టివ్‌గా ఉండాలంటే ₹250 డిపాజిట్ చేయాలి. లేదంటే ₹50 ఫైన్.
* నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో ఏటా ₹1,000 డిపాజిట్ చేయాలి. లేదంటే ₹100 పెనాల్టీ.
News March 15, 2026
పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) అంటే ఏంటి?

ఇది పైప్‌లైన్ ద్వారా నేరుగా ఇంటి వంటగదికి చేరుతుంది. మీటర్ ద్వారా వినియోగాన్ని బట్టి బిల్లు వస్తుంది. యూనిట్ ధర దాదాపు రూ.40-60 (క్యూబిక్ మీటర్) వరకు ఉంటుంది. గ్యాస్ అయిపోతుందన్న చింత ఉండదు. సాధారణంగా నెలకు రూ.400-800 బిల్లు వస్తుంది. కనెక్షన్ పొందడానికి రూ.7 వేల వరకు ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. HYDలోనూ BGL సంస్థ PNG సౌకర్యం కల్పిస్తోంది. అయితే అన్ని ప్రాంతాల్లో PNG లేకపోవడం పెద్ద సమస్య.


