News September 15, 2025

మీటింగ్స్‌లో మాట్లాడితేనే మెప్పు

image

కొంతమంది ఉద్యోగులు ఎంత బాగా పని చేసినా ప్రజెంటేషన్స్, మీటింగ్స్ దగ్గరకి వచ్చేసరికి వెనకబడతారు. దీంతో కెరీర్లో ఎదగలేరు. కాబట్టి ముందుగా మీటింగ్‌కి ఎవరొస్తున్నారు, వారి పరిజ్ఞానం ఎంతో తెలుసుకోవాలి. విషయం ప్రధానం కాబట్టి ఎంతవరకూ ప్రభావవంతంగా, ఆకట్టుకునేలా చెబుతారన్న దానిపైనే దృష్టిపెట్టాలి. అద్దం ముందు నిల్చొని మాట్లాడటం, హావభావాలు వంటివి సాధన చేయండి. స్వరంలో హెచ్చుతగ్గులపై దృష్టి పెట్టడం ముఖ్యం.

Similar News

News February 2, 2026

లోకేశ్ నన్ను హతమర్చాలని చూస్తున్నారు: జోగి

image

AP: రెడ్ బుక్ రాజ్యాంగంతో లోకేశ్ తనను మట్టుబెట్టాలని చూస్తున్నారని మాజీ మంత్రి జోగి రమేశ్ ఆరోపించారు. తనకు ఏదైనా జరిగితే ఆయనదే బాధ్యత అన్నారు. లోకేశ్ ఆదేశంతో MP చిన్ని రౌడీలతో నా ఇంటిపై దాడి చేయించారు. దాడికి ముందు TDP నేతలతో DCP, CI చర్చించారు. TDP గూండాలు ర్యాలీగా పెట్రోలు సీసాలు, కర్రలతో వస్తుంటే వారికి పోలీసులు ఎస్కార్ట్‌గా వచ్చారు. ఇలాగే కొనసాగితే ప్రజలు తిరగబడక మానరు’ అని హెచ్చరించారు.

News February 2, 2026

HYD TO BLR.. 2 గంటల్లో వెళ్లిపోవచ్చు: అశ్వినీ వైష్ణవ్‌

image

దేశంలో హైస్పీడ్ రైళ్లు గంటకు 350KM వేగంతో ప్రయాణిస్తాయని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దీంతో హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు 2 గంటల్లో, పుణేకు 1.45 గంటల్లో, చెన్నైకి 2.55 గంటల్లో చేరుకోవచ్చన్నారు. హైస్పీడ్ కారిడార్‌తో AP-TG-TN మధ్య ఎకానమీ, హెల్త్, టూరిజం అభివృద్ధి చెందుతాయని చెప్పారు. హైస్పీడ్ రైళ్లు తెలుగు రాష్ట్రాలకు గేమ్‌ ఛేంజర్‌గా మారతాయని పేర్కొన్నారు.

News February 2, 2026

సహజ సేద్యంతో ఎక్కువ లాభం.. ఎందుకంటే?

image

వ్యవసాయంలో సహజ సేద్య పద్ధతుల వైపు నేడు చాలా మంది రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి కారణం ఈ విధానంలో పెట్టుబడి ఖర్చు తగ్గడమే. సహజ సేద్యంలో లాభాలు తొలుత ఆలస్యమైనా, కొంత కాలానికి సంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్న రైతులతో సమానంగా ఆదాయం వస్తుంది. క్రిమిసంహారక మందులు, ఎరువులపై వెచ్చించే వ్యయం తగ్గడంతో పాటు పర్యావరణానికి, మన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. మహిళలు ఎక్కువగా ఈ విధానం అనుసరిస్తున్నారు.