News September 15, 2025

రాష్ట్ర స్థాయి అత్యపత్య పోటీలకు జిల్లా క్రీడాకారులు

image

కరీంనగర్‌లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి అత్యపత్య పోటీల్లో పాల్గొనేందుకు సిద్దిపేట జిల్లా క్రీడాకారులు సోమవారం బయలుదేరి వెళ్లారు. సిద్దిపేట జిల్లా అత్యపత్య అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి పోటీలలో ఎంపికైన పురుష, మహిళా సీనియర్ క్రీడాకారులు ఈ పోటీలలో జిల్లా తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ సందర్భంగా వారికి సిద్దిపేట స్పోర్ట్స్ కన్వీనర్ పాల సాయిరాం, కోచ్ మహేష్ శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News September 15, 2025

BHPL: కొడుకు చనిపోయినా కళ్లు బతకాలనుకున్నారు!

image

కొడుకు చనిపోయి పుట్టెడు శోఖంలో ఉన్నా అతడి కళ్లు బతకాలనుకున్నారు ఆ తల్లిదండ్రులు. HYD ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి నేత్రాలు దానం చేసి మానవత్వం చాటుకోవడమే కాదు.. వేల మందికి ఆదర్శంగా నిలిచారు ఆ దంపతులు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సుభాష్ కాలనీకి చెందిన సింగరేణి కార్మికుడు గోవర్ధన్ కుమారుడు శ్రవణ్ గుండెపోటుతో సోమవారం మృతి చెందాడు. దీంతో కొడుకు నేత్రాలను తల్లిదండ్రులు దానం చేశారు.

News September 15, 2025

రాజమండ్రి: సెప్టెంబర్ 17 నుంచి ఉచిత వైద్య సేవలు

image

తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం “స్వస్థ నారీ – సశక్త్ పరివార్ అభియాన్” కార్యక్రమానికి సంబంధించిన ప్రచార గోడ ప్రతులను రాజమండ్రిలో జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామమూర్తి ఆవిష్కరించారు. జిల్లాలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించే శిబిరాల ద్వారా మహిళలకు ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు ఆయన తెలిపారు.

News September 15, 2025

‘మిరాయ్’లో శ్రియ పాత్రపై ప్రశంసల వర్షం

image

సెకండ్ ఇన్నింగ్సులో శ్రియ సినిమాల్లో నటించే పాత్రల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ‘మిరాయ్’లో ఆమె పోషించిన అంబిక పాత్ర ఆ కోవలోకే వస్తుంది. మూవీలో ఆమె ప్రజెన్స్ అదిరిపోయిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. తన నటనతో సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లారని, తెరపై ఆమె కనిపించిన ప్రతిసారి ఓ ఎమోషన్ క్యారీ చేశారని అంటున్నారు. సినిమాకు కీలకమైన పాత్రలో ఆమెను ఎంపిక చేయడం సరైన నిర్ణయమని కొనియాడుతున్నారు.