News September 15, 2025

PDPL: విద్యుత్ డిప్లొమో ఇంజినీర్ల సంఘం ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్

image

తెలంగాణ ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ(TGNPDCL) పరిధిలోని తెలంగాణ విద్యుత్ డిప్లొమో ఇంజినీర్ల సంఘం (TPDEA) ఉపాధ్యక్షుడిగా పెద్దపల్లి ADE/ SPM అడిచర్ల శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఆదివారం హనుమకొండలో జరిగిన కార్యవర్గం ఎన్నికల్లో నాలుగో సారి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌కు సహచర ఉద్యోగులు అభినందనలు తెలియజేశారు.

Similar News

News September 15, 2025

జగిత్యాల: బాధితుల సమస్యల పరిష్కారానికి కృషి: ఎస్పీ

image

జగిత్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో 11 మంది అర్జీదారులతో ఎస్పీ స్వయంగా మాట్లాడి వారి ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఫోన్‌లో ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమోదు చేసి, నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఎస్పీ తెలిపారు. బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.

News September 15, 2025

‘జిల్లాలో పంటలకు సరిపడా యూరియా నిల్వలున్నాయి’

image

జిల్లాలో ఆయా పంటల సాగుకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. బోయినపల్లి మం. కొదురుపాకలోని రైతువేదికలో సోమవారం రైతులకు యూరియా పంపిణీ చేస్తుండగా ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా టోకెన్ పద్ధతి, ఎరువుల పంపిణీని పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఆయా పంటలసాగుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు యూరియా స్టాక్ తెప్పిస్తున్నామన్నారు. రైతులు ఆందోళన చెందొద్దన్నారు.

News September 15, 2025

వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు ఏమందంటే?

image

* <<17714335>>వక్ఫ్<<>> భూముల ఆక్రమణపై కలెక్టర్‌దే తుది నిర్ణయమన్న ప్రొవిజన్‌‌పై SC స్టే విధించింది. ట్రిబ్యునల్/కోర్టు మాత్రమే డిసైడ్ చేయాలంది.
* సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్‌లో ముస్లిమేతరుల సంఖ్య 4, స్టేట్ వక్ఫ్ బోర్డుల్లో 3కు మించొద్దని చెప్పింది.
* స్టేట్ బోర్డుకు నాన్-ముస్లిం CEO కావొచ్చన్న ప్రొవిజన్‌పై స్టే విధించలేదు. కానీ వీలైనంత వరకు ముస్లింనే నియమించాలంది.
* రిజిస్ట్రేషన్‌ రూల్‌లో కోర్టు జోక్యం చేసుకోలేదు.