News September 15, 2025

కేసులు పెట్టినా వెనక్కి తగ్గం: మత్స్యకారులు

image

బల్క్ డ్రగ్ పార్క్‌కు వ్యతిరేకంగా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో మత్స్యకారులు చేపట్టిన నిరసన దీక్షలు సోమవారం రెండవ రోజుకు చేరుకున్నాయి. మమ్మల్ని ఉరితీసి చంపడంటూ మత్స్యకారులు నినాదాలు చేస్తున్నారు. కేసులు పెట్టినా భయపడేది లేదని వారు స్పష్టం చేశారు. బల్క్ డ్రగ్ పార్క్ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాగా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.

Similar News

News September 15, 2025

పార్వతీపురం: ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌కు 10 అర్జీలు

image

పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 10 వినతులు వచ్చినట్లు ఎస్పీ అంకిత సురాణా తెలిపారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపించారు. సమస్యల నివేదక ఎస్పీ కార్యాలయానికి అందజేయాలని చెప్పారు.

News September 15, 2025

MHBD: తప్పని గోస.. రైతు వేదిక వద్దకే సద్ది బువ్వ!

image

మహబూబాబాద్ రైతన్నలకు యూరియా కష్టాలు తప్పట్లేదు. మబ్బులోనే PACS సెంటర్లు, రైతు వేదికలకు చేరుకుంటున్నప్పటికీ టోకెన్లు, యూరియా బస్తాలు దొరక్క అరిగోస పడుతున్నారు. మరిపెడ మండలం తానంచర్లలోని రైతు వేదికలో యూరియా టోకెన్లు ఇస్తారనే సమాచారం అందుకున్న రైతులు తెల్లవారుజామునే అక్కడికి చేరుకున్నారు. గంటల తరబడి లైన్లో నిలబడే పరిస్థితి ఉంటుందని ముందే గ్రహించిన రైతున్న సద్ది పెట్టుకొని వచ్చి అక్కడే భోజనం చేశాడు.

News September 15, 2025

జగిత్యాల: బాధితుల సమస్యల పరిష్కారానికి కృషి: ఎస్పీ

image

జగిత్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో 11 మంది అర్జీదారులతో ఎస్పీ స్వయంగా మాట్లాడి వారి ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఫోన్‌లో ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమోదు చేసి, నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఎస్పీ తెలిపారు. బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.