News April 4, 2024

వైసీపీ డీఎన్‌ఏలోనే శవరాజకీయం ఉంది: CBN

image

AP: విధ్వంస పాలకుడిగా రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశారని, ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారని టీడీపీ చీఫ్ చంద్రబాబు మండిపడ్డారు. కొవ్వూరు ప్రజాగళం సభలో మాట్లాడిన ఆయన.. వైసీపీ డీఎన్‌ఏలోనే శవరాజకీయం ఉందని ఆరోపించారు. రక్తంలో మునిగిన వైసీపీకి ఓట్లు వేయొద్దని స్వయంగా జగన్ చెల్లే కోరుతున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికే మిత్రపక్షాలతో కూటమిగా వచ్చామని చంద్రబాబు తెలిపారు.

Similar News

News April 22, 2025

ఆ దేశంలో చాలా సేఫ్టీ.. అందుకే ఇల్లు కొన్నా: సైఫ్

image

ఖతార్‌లో తనకు చాలా సేఫ్టీగా అనిపించిందని, అందుకే అక్కడ ఓ ఇల్లు కొన్నానని నటుడు సైఫ్ అలీ ఖాన్ అన్నారు. త్వరలోనే తన కుటుంబానికి ఆ ఇల్లు చూపిస్తానని తెలిపారు. ‘నేను ఖతార్‌లో ఇల్లు కొనడానికి చాలా కారణాలు ఉన్నాయి. ముంబై నుంచి అక్కడికి ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. ఖతార్ వాతావరణం అద్భుతంగా ఉంటుంది.’ అని చెప్పారు. ఇటీవల సైఫ్‌పై హత్యాయత్నం జరిగిన క్రమంలో ఆయన అక్కడ ఇల్లు కొనడం చర్చనీయాంశంగా మారింది.

News April 22, 2025

విపత్తులతో ఏ ఒక్కరూ చనిపోకూడదు: అనిత

image

AP: ప్రకృతి విపత్తుల కారణంగా రాష్ట్రంలో ఏ ఒక్కరి ప్రాణాలు పోవడానికి వీల్లేదని హోంమంత్రి అనిత అన్నారు. దీనిపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆమె ఆదేశించారు. ‘గత ప్రభుత్వం వంతెనలు, డ్రైనేజీలు, సాగునీటి ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించింది. అందుకే ఇప్పుడు రాష్ట్రంలో విపత్తులు సంభవిస్తున్నాయి. ఇకపై ఇలాంటివి సంభవించకుండా జాగ్రత్త పడతాం’ అని ఆమె వ్యాఖ్యానించారు.

News April 22, 2025

BRS మాజీ MLA చెన్నమనేనిపై CID కేసు

image

TG: వేములవాడ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌పై సీఐడీ కేసు నమోదు చేసింది. భారత పౌరసత్వం లేకున్నా తప్పుడు సర్టిఫికెట్లతో ఎన్నికల్లో పోటీ చేశారనేదానిపై ఈ కేసు నమోదైంది. జర్మనీ పౌరసత్వాన్ని దాచి ఆయన ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసి లబ్ధి పొందారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు సీఐడీ FIR నమోదు చేసింది.

error: Content is protected !!