News September 15, 2025

KNR: గుడ్ న్యూస్.. వారంలో 5 రోజులు తిరుపతికి రైళ్లు

image

ఉమ్మడి కరీంనగర్ ప్రయాణికులకు వారంలో ఐదు రోజులపాటు తిరుపతికి వెళ్లేందుకు రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. KNR నుంచి తిరుపతికి ఆది, గురువారాల్లో సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, మంగళవారం నాందేడ్ నుంచి తిరుచానూర్‌కు వీక్లీ స్పెషల్ రైలు తిరుపతి మీదుగా నడవనున్నాయి. శుక్రవారం నాందేడ్ నుంచి ధర్మవరం, శనివారం నాందేడ్ నుంచి తిరుపతి రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్లకు KNR, PDPL, జమ్మికుంట స్టేషన్లలో హాల్టింగ్ ఇచ్చారు.

Similar News

News September 15, 2025

అంతర పంటల సాగుతో ఆర్థికాభివృద్ధి: భద్రాద్రి కలెక్టర్

image

అంతర పంటల సాగుతో రైతులు ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ములకలపల్లి మండలం ముకమామిడి గ్రామపంచాయతీ పరిధిలోని గట్టగూడెం గ్రామంలో సోమవారం ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన వెదురు సాగును కలెక్టర్ ప్రారంభించి, మాట్లాడారు. ప్రతి రైతు సాంప్రదాయ పంటలతో పాటు కొత్త పంటలను ప్రయత్నించాలన్నారు. అంతర పంటల సాగు ద్వారా తక్కువ భూమిలో ఎక్కువ లాభాలు పొందవచ్చునని అన్నారు.

News September 15, 2025

రేపు భారత్-అమెరికా వాణిజ్య చర్చలు

image

భారత్, అమెరికా మధ్య రేపు వాణిజ్య చర్చలు జరగనున్నాయి. ఇందుకోసం ఇవాళ రాత్రి US చీఫ్ నెగోషియేటర్, ట్రంప్ సహాయకుడు బ్రెండన్ లించ్ భారత్ చేరుకోనున్నారు. ట్రేడ్ డీల్‌‌పై పరస్పరం చర్చలకు ఎదురుచూస్తున్నట్లు ట్రంప్‌తో పాటు ప్రధాని మోదీ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే.

News September 15, 2025

NZB: ప్రజావాణికి 23 ఫిర్యాదులు

image

నిజామాబాద్ సీపీ సాయి చైతన్య తన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 23 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన బాధితులు సీపీ కార్యాలయానికి వచ్చి వినతిపత్రాలు అందజేశారు. ఫిర్యాదుదారుల సమస్యలు విన్న సీపీ వెంటనే సమస్యలు పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓలకు ఆదేశించారు. ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నేరుగా తమకు ఫిర్యాదు చేయాలన్నారు.