News September 15, 2025
VJA: దుర్గమ్మ దర్శనానికి దసరా మొబైల్ యాప్, చాట్‌బాట్

ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం రూపొందించిన మొబైల్ యాప్, చాట్‌బాట్‌లను దేవదాయ కమిషనర్ రామచంద్ర మోహన్, ఆలయ EO శీనా నాయక్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సేవలు భక్తులకు ఉపయోగపడతాయని తెలిపారు. కాగా ‘దసరా 2025’ పేరుతో యాప్, 9441820717 నంబర్‌తో చాట్‌బాట్ అందుబాటులోకి వచ్చాయి.
Similar News
News September 15, 2025
NZB: ప్రజావాణికి 23 ఫిర్యాదులు

నిజామాబాద్ సీపీ సాయి చైతన్య తన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 23 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన బాధితులు సీపీ కార్యాలయానికి వచ్చి వినతిపత్రాలు అందజేశారు. ఫిర్యాదుదారుల సమస్యలు విన్న సీపీ వెంటనే సమస్యలు పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓలకు ఆదేశించారు. ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నేరుగా తమకు ఫిర్యాదు చేయాలన్నారు.
News September 15, 2025
తిరుపతి: విదేశీ పండ్ల సాగుపై శిక్షణ

APSSDC ఆధ్వర్యంలో విదేశీ పండ్ల సాగుపై ఆన్‌లైన్ విధానంలో ఉచిత నైపుణ్య శిక్షణ కల్పిస్తున్నట్లు తిరుపతి జిల్లా నైపుణ్య అభివృద్ధి శాఖ అధికారి లోకనాథం పేర్కొన్నారు. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఆసక్తి కలిగిన యువత, రైతులు QR కోడ్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
News September 15, 2025
‘గ్రామపాలనాధికారులు మెరుగైన సేవలు అందించాలి’

ఖమ్మం: గ్రామపాలనాధికారులు నిస్వార్థంగా పనిచేస్తూ ప్రజలకు విశిష్ట సేవలు అందించాలని కలెక్టర్ అనుదీప్ అన్నారు. కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్, నూతనంగా నియమించిన గ్రామ పరిపాలన అధికారులకు సోమవారం పోస్టింగ్ ఆర్డర్లను అందజేశారు. జిల్లాలో 299 క్లస్టర్లకు గాను 252 మంది అర్హులైన వారికి మెరిట్ ప్రకారం వారి సొంత మండలం మినహాయించి, ఇతర ప్రదేశాల్లో ప్రభుత్వ నిబంధనల మేరకు పోస్టింగ్ ఇచ్చామన్నారు.