News September 15, 2025
చింతలపూడి: కుమారుడి మరణాన్ని తట్టుకోలేక తల్లి మృతి

కుమారుడి మరణాన్ని తట్టుకోలేక తల్లి మృతి చెందిన ఘటన చింతలపూడి మండలం గురుభట్లగూడెంలో చోటుచేసుకుంది. కుమారుడు చక్రపు వాసు నిన్న అనారోగ్యంతో మృతి చెందడంతో 90 ఏళ్ల చక్రపు శాంతమ్మ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ విషాదాన్ని భరించలేక సోమవారం ఆమె కూడా తుదిశ్వాస విడిచారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
Similar News
News September 15, 2025
శ్రీకాకుళం-విశాఖకు ఈ రైళ్లు నడవనున్నాయి

శ్రీకాకుళం జిల్లా వాసులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. విశాఖ-బ్రహ్మపూర్-విశాఖపట్నం(18525/26) రైలును ఇటీవల రద్దు చేసిన విషయం తెలిసిందే. మరలా సేవలను పునరుద్ధరించినట్లు తాజాగా వెల్లడించింది. పలాస-విశాఖ(67290) మెము రైలును విశాఖ వరకు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇవి శ్రీకాకుళం రోడ్డు, పొందూరు, నౌపడ, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం తదితర స్టేషన్లు మీదుగా నడవనున్నాయి.
News September 15, 2025
విశాఖలో ‘స్వస్త్ నారి-సశక్త్ పరివార్’ అభియాన్

విశాఖ జిల్లాలో మహిళల ఆరోగ్యం కోసం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు “స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్” ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ జగదీశ్వరరావు తెలిపారు. ఆరోగ్య కేంద్రాల్లో గుండెజబ్బులు, మధుమేహం, క్యాన్సర్, గర్భిణుల పరీక్షలు, పిల్లలకు టీకాలు వేస్తారన్నారు. సెప్టెంబర్ 17న ప్రధాని వర్చువల్‌గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News September 15, 2025
లిక్కర్ స్కాం: మరో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన సిట్

మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ ఇవాళ మరో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడు, బాలాజీకుమార్ యాదవ్, నవీన్ కృష్ణ ప్రమేయంపై వివరాలు పొందుపరిచినట్లు తెలుస్తోంది. తాజాగా దాఖలు చేసిన రెండో అనుబంధ అభియోగపత్రంతో కలిపి ఇప్పటి వరకు సిట్ మొత్తం మూడు ఛార్జ్‌షీట్లు దాఖలు చేసినట్లయింది.