News September 15, 2025
రూ.5కే కిలో టమాటా

AP: ఓవైపు తగ్గిన ఉల్లి ధరలు రైతులను ఆందోళనకు గురిచేస్తుంటే టమాటా ధరలూ అదే బాటలో పయనిస్తున్నాయి. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి మార్కెట్‌లో ఇవాళ టమాటా ధరలు కేజీ రూ.5కు పడిపోయాయి. దిగుబడి పెరగడంతో ధరలు పతనమవుతున్నాయి. దీంతో గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. మీ ఏరియాలో టమాటా ధర ఎంత ఉందో కామెంట్ చేయండి?
Similar News
News September 15, 2025
విడాకులు తీసుకున్న వారితో నాకు పెళ్లి అనేవారు: మీనా

తనపై గతంలో వచ్చిన వార్తలను జగపతి బాబు షోలో సీనియర్ నటి మీనా గుర్తు చేసుకున్నారు. ‘అప్పుల్లో ఉన్నామని తక్కువ రెమ్యునరేషన్ తీసుకోవాలని నిర్మాతలు అడిగేవారు. అలా తీసిన సినిమాలు హిట్ అయ్యాక నన్ను మర్చిపోయేవాళ్లు. వరుస అవకాశాలు ఉన్నప్పటికీ నేను పెళ్లి చేసుకున్నాను. 2022లో భర్తను కోల్పోయాక ఇండస్ట్రీలో ఎవరు విడాకులు తీసుకున్నా నాతో పెళ్లి అని వార్తలొచ్చేవి. అవి చూసినప్పుడు బాధేసేది’ అని చెప్పారు.
News September 15, 2025
లిక్కర్ స్కాం: మరో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన సిట్

మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ ఇవాళ మరో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడు, బాలాజీకుమార్ యాదవ్, నవీన్ కృష్ణ ప్రమేయంపై వివరాలు పొందుపరిచినట్లు తెలుస్తోంది. తాజాగా దాఖలు చేసిన రెండో అనుబంధ అభియోగపత్రంతో కలిపి ఇప్పటి వరకు సిట్ మొత్తం మూడు ఛార్జ్‌షీట్లు దాఖలు చేసినట్లయింది.
News September 15, 2025
కాలేజీలు యథావిధిగా నడపండి: సీఎం రేవంత్

TG: కాలేజీల బకాయిలు విడతల వారీగా చెల్లించేందుకు సానుకూలంగా ఉన్నామని సీఎం రేవంత్ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా సమ్మె నిర్ణయాన్ని విరమించుకోవాలని, కాలేజీలు యథావిధిగా నడిపించాలని యూనియన్ నాయకులను ఆయన కోరారు. కళాశాలల సమస్యలు, యాజమాన్యాలు చేస్తున్న డిమాండ్లపై సీఎంతో భట్టి, శ్రీధర్ బాబు భేటీ ముగిసింది. ఈ సాయంత్రం యూనియన్ నాయకులతో మంత్రులు చర్చించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.