News September 15, 2025
NGKL: ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని పరిశీలించిన కలెక్టర్

నాగర్‌కర్నూల్ మండలంలోని తూడుకుర్తి గ్రామంలో చేపట్టిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని కలెక్టర్ బాదావత్ సంతోష్ సోమవారం పరిశీలించారు. గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని నాణ్యతగా మరింత వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడు పాండుతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Similar News
News September 15, 2025
NRPT: ప్రజావాణి అర్జీలను పరిష్కరించాలి: ఎస్పీ

నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ ప్రోగ్రాంలో ఎస్పీ యోగేష్ గౌతమ్ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజావాణిలో అందిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఫిర్యాదులను పరిశీలించి, చట్ట ప్రకారం తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. మొత్తం 15 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ తెలిపారు.
News September 15, 2025
NRPT: ప్రజావాణికి 44 ఫిర్యాదులు

NRPT కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 44 ఫిర్యాదులు అందినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఆమె అర్జీలు స్వీకరించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులను వెంటనే సంబంధిత అధికారులకు పంపి, పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. అధికారులు ఏ ఒక్క ఫిర్యాదును పెండింగ్‌లో పెట్టకుండా, వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
News September 15, 2025
సీఎంకు అనకాపల్లి కలెక్టర్ విజ్ఞప్తి

అనకాపల్లి జిల్లాలో పశుసంపద, పువ్వులు, కూరగాయల సాగుకు ప్రోత్సాహం అందించాలని కలెక్టర్ విజయకృష్ణన్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో పాల్గొని జిల్లా అభివృద్ధి నివేదికను అందజేశారు. ప్రతి ఇంటికి ఒకటికంటే ఎక్కువ పశువులు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఉత్తమ జాతి పశువులను ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసేందుకు రాయితీ అందించాలన్నారు.