News September 15, 2025
సీఎం సదస్సులో నంద్యాల కలెక్టర్

ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్లతో సదస్సు సోమవారం జరిగింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. నంద్యాల జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు కలెక్టర్ రాజకుమారి గణియా సూచనలు చేశారు. అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టాల్సిన ప్రణాళికలపై చర్చించారు.
Similar News
News September 15, 2025
కేటీఆర్‌లా బెదిరింపు దావాలు వేయను: బండి

TG: KTR తనపై వేసిన <<17719172>>పరువునష్టం దావా<<>>పై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ‘దీన్ని న్యాయపరంగా ఎదుర్కొంటా. కేటీఆర్‌లా బెదిరింపుల కోసం దావాలు వేయను. దావా వేయాలనుకుంటే కేసీఆర్, కేటీఆర్ బయటికే రారు. మీరు తిట్టని తిట్లు లేవు. నేను లవంగం తింటే తంబాకు అన్నావ్. నన్ను వాడు, వీడు అన్నావ్. మీ అయ్య నా తల ఆరు ముక్కలు నరుకుతా అన్నాడు. వీటన్నింటిపై పరువు నష్టం దావా వేయరాదా?’ అని బండి ప్రశ్నించారు.
News September 15, 2025
మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయాలని చూస్తున్నారు: భూమన

విద్యా, వైద్యానికి అధిక ప్రాధాన్యమిస్తూ మాజీ సీఎం జగన్ 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేయించారని చిత్తూరు తిరుపతి జిల్లాల వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ.. పేద విద్యార్థుల కోసం తీసుకువచ్చిన మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తిరుపతి పద్మావతి సూపర్ స్పెషాలిటీలో పెండింగ్‌లో ఉన్న 20 శాతం పనులను పట్టించుకోవడం లేదన్నారు.
News September 15, 2025
విశాఖ: ‘వీకెండ్‌లో స్విగ్గీ, జోమోటో రైడర్ల సమ్మె’

విశాఖలో స్విగ్గీ, జోమోటో రైడర్లు ప్రతి శని, ఆదివారాల్లో సమ్మె చేయాలని తీర్మానించారు. జగదాంబలో సీఐటీయూ కార్యాలయంలో రైడర్ల సమావేశం జరిగింది. జోమాటో యాజమాన్యం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందో? లేదో? చూస్తామని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కుమార్ అన్నారు. స్విగ్గీ యాజమాన్యం చర్చలకు రాలేదని తెలిపారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగుతుందన్నారు.