News September 15, 2025

NRPT: ప్రజావాణికి 44 ఫిర్యాదులు

image

NRPT కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 44 ఫిర్యాదులు అందినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఆమె అర్జీలు స్వీకరించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులను వెంటనే సంబంధిత అధికారులకు పంపి, పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. అధికారులు ఏ ఒక్క ఫిర్యాదును పెండింగ్‌లో పెట్టకుండా, వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

Similar News

News September 15, 2025

సిరిసిల్ల: ‘స్వచ్ఛత హీ సేవ’ పోస్టర్ ఆవిష్కరణ

image

‘స్వచ్ఛ భారత్ మిషన్’లో భాగంగా నిర్వహిస్తున్న ‘సఫాయీమిత్ర సురక్ష’ కార్యక్రమంలో, పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ‘స్వచ్ఛత హీ సేవ-2025’ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. సఫాయీ కార్మికులకు తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు.

News September 15, 2025

జాతీయ జెండా ఆవిష్కరించనున్న ప్రభుత్వ విప్ అది

image

సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో జరిగే కార్యక్రమానికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం, ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.

News September 15, 2025

ప్రియుడితో నటి ఎంగేజ్‌మెంట్?

image

రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ రచిత్‌ సింగ్‌తో బాలీవుడ్ నటి హుమా ఖురేషీ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. యాక్టింగ్ కోచ్‌ అయిన రచిత్‌తో హుమా ఏడాదికి పైగా డేటింగ్‌లో ఉన్నట్లు సమాచారం. వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలు పలు సందర్భాల్లో సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. ఈక్రమంలోనే ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. వీటిపై హుమా స్పందించాల్సి ఉంది.