News September 15, 2025
భద్రాద్రి: ‘సూర్యాంశ్’ నామకరణం చేసిన KTR

అన్నపురెడ్డిపల్లి మాజీ ZPTC దంపతులు లావణ్య-రాంబాబు తమ కుమారుడికి పేరు పెట్టాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRను కలిశారు. దంపతులు ‘సు’ అక్షరంతో పేరు కోరగా, KTR తన కుమారుడు హిమాన్షు పేరును గుర్తు చేసుకుని, సూర్యాంశ్ అని నామకరణం చేశారు. KTR దీవెనలు తమ కొడుకును ఆయనలాగే గొప్ప వ్యక్తిని చేస్తాయన్న నమ్మకం ఉందని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. తమ అభిమాన నేతతో గడిపిన క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేమన్నారు.
Similar News
News September 15, 2025
సిరిసిల్ల: ‘స్వచ్ఛత హీ సేవ’ పోస్టర్ ఆవిష్కరణ

‘స్వచ్ఛ భారత్ మిషన్’లో భాగంగా నిర్వహిస్తున్న ‘సఫాయీమిత్ర సురక్ష’ కార్యక్రమంలో, పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ‘స్వచ్ఛత హీ సేవ-2025’ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. సఫాయీ కార్మికులకు తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు.
News September 15, 2025
జాతీయ జెండా ఆవిష్కరించనున్న ప్రభుత్వ విప్ అది

సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో జరిగే కార్యక్రమానికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం, ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.
News September 15, 2025
ప్రియుడితో నటి ఎంగేజ్‌మెంట్?

రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ రచిత్ సింగ్‌తో బాలీవుడ్ నటి హుమా ఖురేషీ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. యాక్టింగ్ కోచ్ అయిన రచిత్‌తో హుమా ఏడాదికి పైగా డేటింగ్‌లో ఉన్నట్లు సమాచారం. వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలు పలు సందర్భాల్లో సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. ఈక్రమంలోనే ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. వీటిపై హుమా స్పందించాల్సి ఉంది.