News September 15, 2025
‘వేములవాడ రాజన్న ఆలయ మూసివేతపై క్లారిటీ ఇవ్వాలి’

వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో ఆలయాన్ని మూసివేస్తున్న ప్రభుత్వ ప్రకటనపై ప్రతాపరామకృష్ణ సోమవారం స్పందించారు. వేములవాడలో ఆయన ఆఫీస్‌లో విలేకరులతో మాట్లాడారు. దసరా తర్వాత మూసివేస్తామని చెప్పిన నేపథ్యంలో ఎన్ని నెలల్లో పూర్తి చేస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. ఆలయ మూసివేతతో 500 ప్రత్యక్ష, 3000 పరోక్ష కుటుంబాలు ప్రభావితమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
Similar News
News September 15, 2025
DANGER: నిద్ర మాత్రలు వాడుతున్నారా?

నిద్ర పట్టేందుకు కొందరు స్లీపింగ్ పిల్స్ వాడుతుంటారు. అయితే వీటి వాడకం ఎక్కువైతే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ప్రమాదకరమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. జ్ఞాపకశక్తి తగ్గడం, తల తిరగడం, ఆందోళన, మెదడు బద్ధకించడం, చూపు అస్పష్టంగా మారడం వంటి సమస్యలు వస్తాయంటున్నారు. వరుసగా 2 రోజులు ఈ మాత్రలు వేసుకుంటే బానిసలవుతారని, డోస్ పెంచాల్సిన పరిస్థితి వస్తుందంటున్నారు. వీటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
News September 15, 2025
జగిత్యాలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆవిర్భావ సభ

బీసీ, ఎస్సీ, ఎస్టీ రైట్స్, రాజ్యాధికార సాధన జేఏసీ ఆవిర్భావ సభ సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కన్వీనర్ డా. విశారదన్ మహారాజ్ మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల హక్కుల సాధన కోసం అందరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సభలో జిల్లా, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
News September 15, 2025
జగిత్యాల : దుర్గ శరన్నవ రాత్రోత్సవాలకు ఆహ్వానం

జగిత్యాల పట్టణంలోని మార్కండేయ ఆలయంలో నిర్వహించనున్న శ్రీ గాయత్రి దుర్గాదేవి శరన్నవరాత్రోత్సవాలకు రావాలని ఆహ్వాన పత్రికను కమిటీ సభ్యులు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావుకు సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.