News September 15, 2025

జిల్లాలో 440 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ

image

జిల్లాలో సోమవారం 35 కేంద్రాలలో యూరియా పంపిణీ చేసినట్లు బాపట్ల జిల్లా వ్యవసాయ అధికారి సుబ్రహ్మణ్యం తెలిపారు. జిల్లాలోని రైతు సంరక్షణా కేంద్రాలు, పిఏసీఎస్‌లలో 440 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేశామన్నారు. జిల్లాలో ఇంకా 220 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయన్నారు. నేడు 4,983 మంది రైతులకు యూరియా పంపిణీ చేశామని తెలిపారు. రైతులు యూరియా కోసం ఆందోళన చెందవద్దన్నారు.

Similar News

News September 16, 2025

నిజామాబాద్: ఈ నెల 17 నుంచి పోషణ మాసం

image

పిల్లల పెరుగుదలకు, పోషణ లోపం తగ్గించుట, బరువు లోపం లేకుండా పోషక ఆహారాలను అందించుటలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం కలెక్టర్ సమావేశం నిర్వహించారు. పోషణ మాసం కార్యక్రమాల అమలు తీరును సమీక్షించి, అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు.

News September 16, 2025

రానున్న 2-3 గంటల్లో వర్షం.. భారీగా ఈదురు గాలులు

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2-3 గంటల్లో వర్షం పడే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. జగిత్యాల, కరీంనగర్, మెదక్, నిర్మల్, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో మోస్తరు వర్షం కురవొచ్చని అంచనా వేసింది. గంటకు 41-61కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.

News September 16, 2025

నిజామాబాద్: విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోవాలి: సీపీ

image

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సోమవారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరిగిన ఇంజినీర్స్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. నేటితరం ఇంజినీర్లు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ముందుగా విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఇంజినీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.