News September 15, 2025
ANU: పరీక్షా ఫలితాలు విడుదల

ANU పరిధిలో నిర్వహించిన PG సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. జులైలో నిర్వహించిన M.SC స్టాటిస్టిక్స్, M.SC బయోకెమిస్ట్రీ పరీక్షల ఫలితాలను విడుదల చేశామని పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు తెలిపారు. రీవాల్యుయేషన్‌కు ఆసక్తి ఉన్న విద్యార్థులు ఒక్కో పరీక్షకు రూ.1,860ల చొప్పున ఈ నెల 24లోపు చెల్లించాలన్నారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.
Similar News
News September 16, 2025
ఉత్తరాంధ్రతో పోటీగా సీమ అభివృద్ధి: చంద్రబాబు

AP: అభివృద్ధిలో ఉత్తరాంధ్రతో రాయలసీమ పోటీ పడుతోందని కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో CM చంద్రబాబు పేర్కొన్నారు. ‘ఉత్తరాంధ్రలో ఆర్సెలార్ మిట్టల్, TCS, గూగుల్ వంటి సంస్థలు వస్తున్నాయి. రాయలసీమలో లేపాక్షి నుంచి ఓర్వకల్లు వరకూ పెద్దఎత్తున పరిశ్రమలు వస్తాయి. శ్రీసిటీతో పాటు తిరుపతి కేంద్రంగానూ పరిశ్రమలు వస్తున్నాయి. పోర్టులు, ఎయిర్ పోర్టులు కూడా వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నాం’ అని తెలిపారు.
News September 16, 2025
గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ పరివాహక ప్రజలకు ALLERT

భైంసాలోని గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతంలో వర్షం కురుస్తున్నందున ప్రాజెక్ట్ వరద గేట్ల నుంచి నీటిని ఏ క్షణమైన విడుదల చేస్తామని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సోమవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. నదీ పరివాహక ప్రాంతంలోకి (దిగువకు) పశువులు, గొర్రెలు వెళ్లకుండా రైతులు, గొర్రెకాపరులు జాగ్రత్త వహించాలన్నారు. తగిన సూచనలు చేసే వరకు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
News September 16, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 16, మంగళవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.52 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.04 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.11 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.34 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.17 గంటలకు
✒ ఇష: రాత్రి 7.30 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.