News April 4, 2024
అమేథీ రేసులోకి ‘అల్లుడి’ ఎంట్రీ?

రాహుల్ వయనాడ్‌లో పోటీ చేస్తుండటంతో కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా భావించే అమేథీ సీటుపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తాను పోటీ చేయాలనుకుంటే అమేథీ నుంచే బరిలోకి దిగుతానని.. గాంధీ ఫ్యామిలీని అమేథీ కోరుకుంటోందన్నారు. దీంతో ఆయన బరిలోకి దిగొచ్చనే వార్తలు జోరందుకున్నాయి. కాగా అమేథీని తిరిగి దక్కించుకోవాలని కాంగ్రెస్ ఆశిస్తోంది.
<<-se>>#Elections2024<<>>
Similar News
News January 16, 2026
ప్రజల నమ్మకానికి నిదర్శనం.. ముంబై రిజల్ట్స్‌పై అమిత్ షా

దేశం దృష్టిని ఆకర్షించిన BMC ఎన్నికల్లో BJP నేతృత్వంలోని మహాయుతి కూటమి విజయం దాదాపు ఖరారైంది. 227 వార్డులకుగానూ 129 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. 72 స్థానాలతో ఠాక్రే సోదరుల కూటమి తర్వాతి స్థానంలో ఉంది. కాంగ్రెస్ కేవలం 15 సీట్లలోనే ప్రభావం చూపుతోంది. NDA ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, విధానాలపై ప్రజలకున్న విశ్వాసానికి ఈ ఫలితాలే నిదర్శనమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
News January 16, 2026
ఏపీకి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి: లోకేశ్

AP: రాష్ట్రానికి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి రానుందని మంత్రి లోకేశ్ ప్రకటించారు. ‘AM గ్రీన్’ కంపెనీ కాకినాడలో 1.5 మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఎక్స్‌పోర్ట్ టర్మినల్ ఏర్పాటు చేయబోతుందని, దీనివల్ల 8వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయని ట్వీట్ చేశారు. ఇక్కడ ఉత్పత్తి అయిన అమ్మోనియాను జపాన్, జర్మనీ, సింగపూర్‌కు ఎగుమతి చేస్తారని పేర్కొన్నారు.
News January 16, 2026
మోడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల

TG: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశ పరీక్షకు షెడ్యూల్ విడుదలైంది. ఆరో తరగతిలో ప్రవేశాలతో పాటు 7-10 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. OC విద్యార్థులు రూ.200, మిగతావారు రూ.125 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. మార్చి/ఏప్రిల్‌లో హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. April 19న ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. అనంతరం ఫలితాలు వెలువడనున్నాయి.


