News September 16, 2025

ఏలూరు: ఆర్ఐహెచ్ సీఈఓగా ధాత్రి రెడ్డి

image

రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్ఐహెచ్) సీఈఓగా 2020 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి ధాత్రి రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆమె ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమెకు ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ సీఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో ఆమె కీలక పాత్ర పోషించనున్నారు.

Similar News

News September 16, 2025

శ్రీవారి పాదాల చెంత ఘోర అపచారం: భూమన

image

AP: శ్రీవారి పాదాల చెంత ఘోర అపచారం జరిగిందని YCP నేత భూమన కరుణాకర్ రెడ్డి వాపోయారు. ‘అలిపిరిలో మలమూత్రాలు విసర్జించే చోట, మద్యం బాటిల్స్ మధ్య శ్రీ మహావిష్ణువు విగ్రహం పడి ఉంది. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా, హైందవ ధర్మానికి తూట్లు పొడిచేలా టీటీడీ తీరు ఉంది. బీఆర్ నాయుడు టీటీడీ ఛైర్మన్ అయిన తర్వాత వరుసగా ఘోర అపచారాలు జరుగుతున్నాయి. హిందూ సంఘాలన్నీ వ్యతిరేకించాల్సిన సమయం వచ్చింది’ అని పేర్కొన్నారు.

News September 16, 2025

పిల్లలకు పాలు ఎలా పట్టించాలి?

image

బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు పట్టించాలి. అయితే జాగ్రత్తగా పాలు పట్టించకపోతే గొంతులోకి బదులు ఊపిరితిత్తుల్లోకి వెళ్లి బిడ్డకు ప్రాణాంతకమవుతుంది. పాలిచ్చేటప్పుడు శరీరం కంటే బిడ్డ తల పైకి ఉండాలి. చేతులతో బిడ్డ భుజాలు, తల, వీపు భాగానికి ఆసరా ఇవ్వాలి. పాలివ్వడానికి తల్లి ముందుకు ఒంగకూడదు. కుర్చీలో వెనక్కి ఆనుకొని పట్టించాలి. పాలు పట్టాక జీర్ణం అయ్యేందుకు కొద్దిసేపు బిడ్డ వీపు నెమ్మదిగా నిమరాలి.

News September 16, 2025

తెలంగాణ అప్డేట్స్

image

* ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్‌లో నూతన పాస్‌పోర్టు కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
* ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌కు రానున్న కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్. రేపు తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమానికి హాజరు.
* నల్గొండలో పదేళ్ల బాలికపై అత్యాచారం కేసులో మర్రి ఊషయ్యకు 24 ఏళ్ల జైలు శిక్ష విధించిన పొక్సో కోర్టు. బాధితురాలికి రూ.10 లక్షలు చెల్లించాలని తీర్పు.