News September 16, 2025

CAT-2025 దరఖాస్తుకు గడువు పొడిగింపు

image

CAT-2025 రిజిస్ట్రేషన్‌ గడువును SEP 20 వరకు పొడిగించారు. ఆసక్తిగల డిగ్రీ ఉత్తీర్ణులైన, డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డులను NOV 5న విడుదల చేస్తారు. క్యాట్ -2025 ప్రవేశ పరీక్ష NOV 30వ తేదీన నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.2600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1,300 చెల్లించాల్సి ఉంటుంది. వెబ్‌సైట్: https://iimcat.ac.in/

Similar News

News September 16, 2025

పంట దిగుబడిని పెంచే నానో ఎరువులు

image

వ్యవసాయంలో చాలా కాలంగా రైతులు సంప్రదాయ యూరియా, DAPలను ఘన రూపంలో వాడుతున్నారు. వాటి స్థానంలో భారత రైతుల సహకార ఎరువుల సంస్థ(IFFCO) ద్రవరూపంలో నానో యూరియా, నానో DAPలను అందుబాటులోకి తెచ్చింది. వీటిని సూచించిన పరిమాణంలో నీటితో కలిపి పిచికారీ చేస్తే.. ఆకులలోని పత్రరంధ్రాల ద్వారా ఎరువులోని పోషకాలను మొక్కలు 80-90 శాతం గ్రహిస్తాయి. దీని వల్ల ఎరువు నష్టం తగ్గి దిగుబడులు పెరుగుతాయని IFFCO చెబుతోంది.

News September 16, 2025

నానో ఎరువులను ఎలా వాడాలి?

image

నానో యూరియా, DAPలను పైరుపై పిచికారీ పద్ధతిలోనే వాడాలి. వీటిని భూమిలో, డ్రిప్‌‌లలో వాడకూడదు. పంటలకు దుక్కిలో వ్యవసాయ నిపుణులు సిఫార్సు చేసిన ఎరువులను యథావిధిగా వేయాలి. పంటకు పైన ఎరువులను సిఫార్సు చేసినప్పుడు మాత్రం.. నానో ఎరువుల రూపంలో పిచికారీ చేసుకోవాలి. నానో యూరియా, DAPలను ఎకరాకు అర లీటరు(లీటరు నీటికి 4ml)చొప్పున పిచికారీ చేయాలి. తర్వాత సంప్రదాయ యూరియా, DAPలను పంటకు వేయనవసరం లేదు.

News September 16, 2025

నానో ఎరువులను ఎప్పుడు పిచికారీ చేయాలి?

image

వరిలో నానో యూరియా, నానో DAPలను కలిపి పిలకలు తొడిగే దశలో, చిరు పొట్ట దశలో పిచికారీ చేసుకోవచ్చు. కూరగాయలు, పప్పు దినుసుల పంటల్లో మొక్కల రెమ్మలు వచ్చే దశ, పూత దశలో స్ప్రే చేసుకోవచ్చు. పండ్ల తోటల్లో మామిడి పూతకు ముందు డిసెంబరు నెలలో నానో DAP స్ప్రే చేయడం వల్ల పూత పెరిగి మంచి దిగుబడులు వచ్చాయని రైతులు చెబుతున్నారు. కాబట్టి పండ్ల తోటల్లో పూతకు ముందు నానో DAPని పిచికారీ చేసి మంచి ఫలితాలను పొందవచ్చు.