News April 4, 2024
మూసీ నదిపై GHMC కీలక నిర్ణయం

HYDలోని మూసీ నదికి ఇరువైపులా 50 మీటర్ల పరిధిలో నిర్మాణం, లే అవుట్ అనుమతులను నిలిపివేయాలని GHMC నిర్ణయించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ ఉత్తర్వులు జారీ చేశారు. వేర్వేరు సంస్థల ఆధ్వర్యంలో చేపట్టే అభివృద్ధి పనులను అనుమతించొద్దని ఉప కమిషనర్లు, ప్రణాళిక అధికారులకు తెలుపుతూ వెంటనే ఆదేశాలను అమలు చేయాలని తెలియజేశారు. మూసీ మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్‌లో భాగంగా చర్యలకు ఉపక్రమించారు.
Similar News
News January 21, 2026
HYD: వందేళ్లు దాటినా.. చెక్కుచెదరని ‘ప్యాలెస్ రాజసం’

HYD.. తన గుండెలపై ఘన చరిత్రను మోస్తోంది. చెక్కుచెదరని వందలేళ్ల చారిత్రక కట్టడాలు కళ్లు చెదిరేలా మెరిసిపోతున్నాయి. బేగంపేటలోని పైగా ప్యాలెస్‌కు 126 ఏళ్లు నిండినా, నేటికీ అదే వైభవంతో వెలిగిపోతోంది. విఖార్ ఉల్ ఉమ్రా నియో-క్లాసికల్ శైలిలో నిర్మించిన ఈ రెండంతస్తుల భవనం 4ఎకరాల్లో విస్తరించింది. 1975-2008 వరకు HUDA కార్యాలయంగా, 2023 వరకు అమెరికా కాన్సులేట్‌గా సేవలందించింది. త్వరలో HMDA ఆఫీస్‌గా మారనుంది.
News January 21, 2026
HYD: భార్యను చంపి ‘STATUS’ పెట్టుకున్నాడు

‘నా పార్ట్‌నర్‌ను చేతులారా చంపేశా’నంటూ స్టేటస్ పెట్టుకున్నాడో భర్త. ఈ ఘటన బోరబండలోని రెహ్మత్‌నగర్లో జరిగింది. వనపర్తి(D)కి చెందిన రొడ్డె ఆంజనేయులు, సరస్వతికి 14 YRS క్రితం పెళ్లైంది. బతుకుదెరువు కోసం వచ్చి రాజీవ్‌గాంధీనగర్లో నివాసముంటున్నారు. భార్య హౌస్ కీపింగ్‌గా, భర్త కార్ల బిజినెస్ చేసేవాడు. ఈ క్రమంలో అనుమానం ఎక్కువవ్వడంతో సోమవారం నిద్రిస్తున్న <<18903197>>సరస్వతిపై ఆంజనేయులు రోకలిబండతో దాడి<<>>చేసి చంపేశాడు.
News January 21, 2026
HYD: VIT-D పుష్కలం.. 10 రోజుల్లో సాగు మెలకువలు

శరీరానికి VIT- Dని సంవృద్ధిగా అందించే పుట్టగొడుగులకు డిమాండ్ పెరిగింది. 10 రోజుల్లో సాగు మెలకువలు నేర్చుకోవాలనుకుంటున్నారా? విస్తరణ విద్యాసంస్థ, ప్రొ.జయ శంకర్ యునివర్సిటీ నిపుణులు వీటి సాగుపై నైపుణ్య శిక్షణను FEB 18- 28వరకు రాజేంద్రనగర్‌లో ఇస్తారు. ఆసక్తిగలవారు అప్లికేషన్ ఫామ్, సమాచారం కోసం వెబ్‌సైట్లు www.eeihyd.org/ www.pjtau.edu.inలో చూడాలని, అప్లై చేయడానికి FEB 8 వరకే అవకాశం ఉంటుందని తెలిపారు.


