News April 4, 2024
SRPT: ‘రైతులతో వెళ్లి సాగర్ గేట్లు బద్దలు కొడతాం’

జిల్లాలోని అన్ని గ్రామాల చెరువులను సాగర్ నీటి ద్వారా నింపాలని, నీరు వదలక పోతే నేరుగా రైతులతో వచ్చి గేట్లు బద్దలు కొడతామని నల్లగొండ పార్లమెంట్ BJP ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరించారు. గురువారం సాగర్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్ వద్ద నీటిని పరిశీలించి మాట్లాడారు. నీరు లేక గ్రామాలలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే ప్రభుత్వం గ్రామాలలో చెరువులను నింపాలన్నారు.
Similar News
News January 20, 2026
నల్గొండ: B.P.Ed, D.P.Ed పరీక్షల షెడ్యూల్ విడుదల

ఉమ్మడి నల్గొండ జిల్లా మహాత్మ గాంధీ యూనివర్సిటీ పరిధిలో B.P.Ed, D.P.Ed సెమిస్టర్-1 రెగ్యులర్‌కు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ ఉపేందర్ రెడ్డి మంగళవారం ప్రకటించారు. ఫిబ్రవరి-4 నుంచి ఫిబ్రవరి-11 మధ్య పరీక్షలు జరుగుతాయని, విద్యార్థులు గమనించాలని ఆయన కోరారు.
News January 20, 2026
నల్గొండ: బత్తాయి రైతులకు ‘సంఘ’ బలమే శ్రీరామరక్ష : కలెక్టర్

బత్తాయి రైతులు ప్రణాళికాబద్ధంగా సాగు చేస్తూ లాభాలు గడించాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. మంగళవారం రైతుల అనుభవాలపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. దళారుల దోపిడీని అరికట్టి, గిట్టుబాటు ధర సాధించాలంటే ‘రైతు ఉత్పత్తిదారుల సంఘాల’ (FPO) ఏర్పాటు ఆవశ్యకమని స్పష్టం చేశారు. మార్కెటింగ్, నిల్వ సౌకర్యాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని రైతులకు ఆయన హామీ ఇచ్చారు.
News January 20, 2026
నల్గొండ: మహిళలకు ఉచిత బ్యూటీషియన్ కోర్సు శిక్షణ

నల్గొండలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం (మహిళా ప్రాంగణం) ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత బ్యూటీషియన్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మేనేజర్ శ్రీమతి ఎ.అనిత తెలిపారు. ఆసక్తి గల మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్హత సర్టిఫికేట్ (8th క్లాస్ pass) జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకొని నల్గొండలోని మహిళా ప్రాంగణంలో సంప్రదించాలని తెలిపారు.


