News September 16, 2025
భువనగిరి: వైద్యం వికటించి యువతి మృతి

వైద్యం వికటించి యువతి మృతి చెందిన ఘటన HYD నాచారం PS పరిధి స్నేహపురి కాలనీ సత్య లాప్రోస్కోపిక్ ఆస్పత్రిలో జరిగింది. బాధితుల వివరాలిలా.. యాదాద్రి (D) చళ్లూరుకు చెందిన శైలజ(22) కడుపు నొప్పితో వస్తే అపెండిక్స్ ఆపరేషన్ చేశారు. శస్త్రచికిత్స వికటించడంతో వేరే ఆస్పత్రికి తరలించాలని సూచించారని ఆరోపించారు. సికింద్రాబాద్‌లోని మరో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిందని ఆస్పత్రిముందు ఆందోళనకు దిగారు.
Similar News
News September 16, 2025
సంగారెడ్డి: ‘ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి’

జిల్లాలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఈనెల 17వ తేదీన ఘనంగా నిర్వహించాలని ఆదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి మంగళవారం మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పారు. సమావేశంలో డీఆర్ఓ పద్మజారాణి, డీఎస్పీ సత్తయ్య గౌడ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
News September 16, 2025
జగిత్యాల: యూత్ కాంగ్రెస్ కోఆర్డినేటర్లకు ప్రోసీడింగ్‌లు అందజేత

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో మంగళవారం మాజీ మంత్రి జీవన్ రెడ్డి యూత్ కాంగ్రెస్ నాయకులకు ప్రోసీడింగ్‌లను అందజేశారు. ఇటీవల జగిత్యాల పట్టణం, పలు మండలాలకు కొత్తగా సోషల్ మీడియా కోఆర్డినేటర్లుగా నియమితులైన వారికి ఆయన ఈ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు.
News September 16, 2025
సంగారెడ్డి: రేపటి నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ

కెపాసిటీ బిల్డింగ్ పై ఉపాధ్యాయులకు ఈనెల 17 నుంచి 20 వరకు డివిజన్ల వారిగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. 17న ఖేడ్ 18న జహీరాబాద్, 19న సంగారెడ్డి, 20న పటాన్ చెరు డివిజన్లో శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. ఉపాధ్యాయులు తప్పనిసరిగా శిక్షణకు హాజరుకావాలని సూచించారు.