News September 16, 2025

MIM- జూబ్లీహిల్స్ ఎన్నికలతో బిహార్ ఎన్నికలకు లింక్

image

బిహార్ ఎన్నికలకు, జూబ్లిహిల్స్ ఉపఎన్నికలకు అధికారికంగా లింకు లేకపోయినా MIM మాత్రం లింక్ పెడుతోంది. బిహార్‌లో కాంగ్రెస్, ఆర్జేడీ కలిసి హాఘట్ బంధన్ కూటమిని ఏర్పాటు చేస్తున్నాయి. అందులో MIM చేరితే ఇక్కడ ఆ పార్టీ పోటీలో ఉండకకపోవచ్చు. ఒకవేళ కూటమిలో చేరకపోతే MIM కచ్చితంగా పోటీచేస్తుంది. ఇదీ MIM అధినేత ఆలోచన అని సమాచారం. ఈ పొలిటికల్ ఈక్వేషన్ క్లారిటీ కోసం కొద్ది రోజులు ఆగాల్సిందే.

Similar News

News September 16, 2025

HYD: పూడిక తీయండి.. సమస్య తీర్చండి!

image

నగరంలో వర్షం వచ్చిన ప్రతిసారి చాలాచోట్ల వరదనీరు నిలిచిపోతోంది. కారణం ఆయా ప్రాంతాల్లో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీల్లో పూడిక పేరుకుపోవడమే. ఇలాంటి 40 ప్రాంతాలను హైడ్రా గుర్తించింది. అక్కడ డ్రైనేజీల్లో పేరుకుపోయిన పూడికను యుద్ధప్రాతిపదికన తొలగించడానికి  హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నడుంబిగించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. పూడిక తొలగిస్తే వరదనీటి సమస్యకు పరిష్కారం లభించినట్లవుతుంది.

News September 16, 2025

MGBS మెట్రో స్టేషన్‌లో నూతన పాస్ పోర్ట్ సేవా కేంద్రం

image

దేశంలోనే పాస్‌పోర్ట్ జారీలో 5వ స్థానంలో తెలంగాణ నిలిచిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్‌లో నూతన పాస్ పోర్ట్ సేవా కేంద్రాన్ని MP అసదుద్దీన్ ఒవైసీ, MP అనిల్ కుమార్ యాదవ్, MLC రియాజుల్ హసన్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలసి మంత్రి ప్రారంభించారు. దేశంలోనే మొదటిసారి మెట్రోలో ప్రారంభమైన పాస్ పోర్ట్ కేంద్రం ఇదే అని ఆయన వెల్లడించారు.

News September 16, 2025

HYD: నాన్న.. నీవెక్కడ?

image

నాన్న రాక కోసం ఆ బాలుడు ఎదురుచూపులు ఆపడం లేదు. గుండెకు హత్తుకొని లాలించే తండ్రి కనిపించక చిన్నోడు వెక్కివెక్కి ఏడుస్తోండు. వరదలో గల్లంతైన కొడుకు కోసం తల్లి, భర్త జాడెక్కడా? అని భార్య కన్నీరుపెట్టుకుంటోంది. వినోభానగర్‌లో వరదల్లో కొట్టుకుపోయిన సన్నీ ఫ్యామిలీ విషాద గాథ ఇది. వరదల్లో కొట్టుకుపోయిన అతడి ఆనవాళ్లు 40 గంటలైనా తెలియలేదు. ఆకలి, దూప వదిలి కుటుంబీకులు నాలాల వద్ద పడిగాపులు కాయడం బాధాకరం.