News September 16, 2025
జగిత్యాల: ‘విద్యార్థులకు సాంకేతిక విద్యను బోధించాలి’

విద్యార్థులకు సాధారణ విద్యతో పాటు సాంకేతిక విద్యను బోధించాలని, అప్పుడే విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తారని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కార్యక్రమాన్ని మంగళవారం అయన సందర్శించారు. విద్యార్థులకు పాఠాలు సులభతరంగా బోధన చేయడానికి టీఎల్ఎం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఆయన వెంట డీఈవో రాము తదితరులు ఉన్నారు.
Similar News
News September 16, 2025
మంజీరా నది ఉరకలేస్తుంది..!

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి మళ్లీ పెరిగింది. దీంతో ప్రాజెక్టులోని తొమ్మిది గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ వరద ఉద్ధృతి కారణంగా పిట్లం మండలం బొల్లక్ పల్లి మంజీరా బ్రిడ్జి వద్ద మంజీర నది ఉరకలేస్తూ ప్రవహిస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి ఔట్‌ఫ్లో 62,542 క్యూసెక్కులుగా ఉంది.
News September 16, 2025
కామారెడ్డిలో ‘స్వస్త్ నారీ సశక్తి పరివార్ అభియాన్’

కామారెడ్డి జిల్లాలో ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు ‘స్వస్త్ నారీ సశక్తి పరివార్ అభియాన్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అన్ని పీహెచ్‌సీల పరిధిలో ఈ కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. 15 రోజులు జరిగే కార్యక్రమం విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు.
News September 16, 2025
సంగారెడ్డి: ‘శారీరక వైకల్యం విద్యార్థుల ప్రొఫార్మా సమర్పించాలి’

జిల్లాలోని అన్ని పాఠశాలల్లో చదువుతున్న శారీరక వైకల్యం ఉన్న విద్యార్థుల ప్రొఫార్మా-I ను సమర్పించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్ల తెలిపారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. శారీరక వైకల్యం ఉన్న విద్యార్థుల PH సర్టిఫికెట్లను డీఈవో కార్యాలయంలో సమర్పించాలన్నారు. మార్చి 2026లో జరిగే రెగ్యులర్ SSC పబ్లిక్ పరీక్షలకు CWSN అభ్యర్థులకు మినహాయింపులు ఇవ్వనున్నట్టు తెలిపారు.