News April 4, 2024
ట్రాక్టర్‌కు సీట్ బెల్ట్ లేదని చలాన్
TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. ట్రాక్టర్‌పై వెళ్తుండగా సీటు బెల్ట్ లేదని పాల్వంచ పోలీసులు ట్రాఫిక్ చలాన్ విధించారు. ట్రాక్టర్‌కు సీటు బెల్ట్ ఉంటుందా? లేదా? అని షోరూంకు కాల్ చేశానని, వాళ్లు ఉండదని చెప్పారని ఆయన తెలిపారు. మరి ట్రాఫిక్ పోలీసులు దీనిపై ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Similar News
News February 5, 2025
కొమ్మాలలో అద్భుతం.. సూర్య కిరణాల మధ్య లక్ష్మీనరసింహస్వామి
గీసుగొండ మండలం కొమ్మాల గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రెండు గుట్టల నడుమ ఉన్న నరసింహస్వామి విగ్రహాలను బుధవారం ఉదయం పూజా సమయంలో సూర్యకిరణాలు తాకాయి. సూర్యకిరణాల తాకిడితో నరసింహస్వామి ప్రతిబింబం మెరుస్తూ కనిపించింది. ఆలయానికి వచ్చిన భక్తులు ఈ అద్భుత దృశ్యాన్ని కెమెరాల్లో బంధించారు.
News February 5, 2025
మేడారంలో ఇవాళ్టి నుంచి శుద్ధి కార్యక్రమాలు
TG: ములుగు(D) తాడ్వాయి(మ) మేడారం మినీ జాతరకు సిద్ధమవుతోంది. ఇవాళ్టి నుంచి సమ్మక్క-సారలమ్మకు పూజలు ప్రారంభం కానున్నాయి. కన్నెపల్లిలో సారలమ్మ, మేడారంలోని సమ్మక్క ఆలయాల్లో అర్చకులు శుద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆలయాల్లోని పూజా సామగ్రిని శుద్ధి చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. దేవతల పీటలను శుభ్రం చేసి, ముగ్గులతో సుందరంగా అలంకరిస్తారు. ఈ నెల 12 నుంచి 15 వరకు మినీ జాతర వేడుకలు నిర్వహిస్తారు.
News February 5, 2025
ఉమ్మితే భారీ జరిమానా.. బెంగాల్ యోచన
పొగాకు, పాన్ మసాలా నమిలి ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయడం పశ్చిమ బెంగాల్‌లోని ప్రధాన సమస్యల్లో ఒకటి. దీన్ని అడ్డుకునేందుకు ఆ రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయాన్ని తీసుకోనుంది. బహిరంగప్రాంతాల్లో ఉమ్మేవారిపై అత్యంత భారీగా జరిమానాలు విధించేలా ఓ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే ఇలాంటి చట్టం ఉన్నప్పటికీ భారీ మార్పులు, జరిమానాతో కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.