News September 16, 2025

ప్రతి రైతుకు యూరియా అందే విధంగా చూడాలి: కలెక్టర్

image

ప్రతి రైతుకు యూరియా అందే విధంగా ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సూచించారు. మరిపెడ PACS పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. సొసైటీ వద్దకు వచ్చిన రైతులకు నీడ, మంచి నీటి వసతులు కల్పించాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా పంపిణీ చేయాలని సూచించారు. యూరియా సరఫరా చేస్తున్న ప్రక్రియను పారదర్శకంగా అమ్మకాల రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు.

Similar News

News September 17, 2025

ఖమ్మం: రేపటి నుంచి సదరం క్యాంపులు

image

ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఈ నెల 18 నుంచి సదరం క్యాంపులు నిర్వహించనున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ నరేందర్ తెలిపారు. దివ్యాంగులు ఈ క్యాంపుల కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. ఈ సదరం క్యాంపులు ఈ నెల 18, 23, 25, 30వ తేదీలలో జరుగుతాయి. అర్హులైన దివ్యాంగులు తమ మెడికల్ రిపోర్టులు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, స్లాట్ బుకింగ్ స్లిప్‌తో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి హాజరు కావాలని ఆయన కోరారు.

News September 17, 2025

ఆఫ్గనిస్థాన్‌పై బంగ్లాదేశ్ గెలుపు

image

ఆసియా కప్: ఆఫ్గనిస్థాన్‌పై బంగ్లాదేశ్ 8 రన్స్ తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టు 20 ఓవర్లలో 154/5 పరుగులు చేసింది. తన్జిద్ 52, సైఫ్ 30, తౌహిద్ 26 రాణించారు. రషీద్, నూర్ అహ్మద్‌లకు చెరో 2, అజ్మతుల్లా ఒక వికెట్ తీశారు. ఆఫ్గన్ జట్టు 146 రన్స్‌కు ఆలౌటైంది. గుర్బాజ్ 35, అజ్మతుల్లా 30, రషిద్ 20 మినహా ఎవరూ మంచిగా రాణించలేదు. ముస్తఫిజుర్ 3, నసుమ్, తస్కిన్, రిషద్‌లకు తలో వికెట్ దక్కింది.

News September 17, 2025

జైపూర్: విద్యారంగ బలోపేతానికి ప్రభుత్వం చర్యలు

image

విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ అన్ని ప్రభుత్వ పాఠశాలలు సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చెప్పారు. జైపూర్ మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. తరగతి గదులు, రిజిస్టర్లు, వంటశాల సామాగ్రి భద్రపరచు గది, పరిసరాలను పరిశీలించారు. అధికారులు తదితరులు ఉన్నారు.