News September 16, 2025

దేశానికి సంక్షేమం పరిచయం చేసింది NTR: చంద్రబాబు

image

AP: దేశ రాజకీయాల్లో NTR ఒక సంచలనం అని CM చంద్రబాబు కొనియాడారు. విజయవాడలో సజీవ చరిత్ర-1984 అనే పుస్తకావిష్కరణలో సీఎం పాల్గొన్నారు. దేశానికి సంక్షేమం పరిచయం చేసింది NTR అని, ఆయన స్ఫూర్తితో స్వర్ణాంధ్ర కల సాకారం చేస్తామని CBN తెలిపారు. అమరావతిలో తెలుగు వైభవం పేరుతో ఎన్టీఆర్ స్మృతి వనం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 1984లో జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం ఎప్పటికీ సజీవంగానే ఉంటుందన్నారు.

Similar News

News January 29, 2026

KCR ఫామ్ హౌస్‌కు బయల్దేరిన సిట్!

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో <<18991166>>నోటీసులు<<>> ఇచ్చేందుకు సిట్ అధికారులు ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్‌కు బయల్దేరినట్లు తెలుస్తోంది. కాసేపట్లో ఆయనకు నోటీసులు అందించే అవకాశముంది. ఆపై సిట్ నోటీసులపై ప్రకటన చేయనుంది. మరోవైపు రేపు సిట్ చీఫ్ సజ్జనార్ కేసీఆర్‌ను విచారించనున్నట్లు సమాచారం.

News January 29, 2026

ఇవాళ KCRకు సిట్ నోటీసులు?

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఇవాళ సిట్ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే ఆయనకు నోటీసులు ఇచ్చి, రేపు అక్కడే సిట్ బృందం విచారించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో హరీశ్ రావు, కేటీఆర్, సంతోష్ రావులను సిట్ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈసారి ఏకంగా కేసీఆర్‌ను విచారణకు పిలుస్తారనే వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

News January 29, 2026

లవ్లీ హోం హ్యాక్స్

image

* కాఫీపొడి, పుదీనా ఆకులు, బేకింగ్ సోడా, నిమ్మతొక్కలు ఒక గిన్నెలో వేసి ఒక మూలన ఉంచితే గది అంతా పరిమళం వ్యాపిస్తుంది.
* కిచెన్‌లో గట్టు, టైల్స్, కిటికీ అద్దాలు జిడ్డుగా ఉంటే పావు కప్పు వెనిగర్, చెంచా బేకింగ్ సోడా, రెండు కప్పుల నీరు కలిపి లిక్విడ్ తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాటిల్లో వేసి జిడ్డు ఉన్నచోట చల్లి శుభ్రం చేస్తే సరిపోతుంది.
* ఉప్పు, నిమ్మరసం కలిపి పింగాణీ పాత్రలను తోమితే మెరుస్తాయి.