News September 17, 2025

RGM: సింగరేణి S & PCఅధికారులతో సమావేశం

image

RGM సింగరేణి సంస్థ GM ఆఫీస్ లో RG-1, 2, 3, శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాల S&PC డిపార్ట్మెంట్ అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా GM సెక్యూరిటీ లక్ష్మీనారాయణ, GM లలిత్ కుమార్ పాల్గొని మాట్లాడారు. సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వహించే సమయంలో వినియోగాన్ని తగ్గించాలన్నారు. దొంగతనాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారులు వీరారెడ్డి, షరీఫ్, షబీరుద్దీన్ ఉన్నారు.

Similar News

News September 17, 2025

ASF: యువకుడి ఆత్మహత్య

image

అప్పుల బాధ భరించలేక ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ఆసిఫాబాద్ సీఐ బాలాజీ వరప్రసాద్ తెలిపిన వివరాలు.. ASF మండలం అంకుశాపూర్ కి చెందిన సుభాశ్ (32) అప్పుల బాధతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లి జానకాపూర్ శివారులో ఓ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

News September 17, 2025

కలకడ: హత్యాయత్నం కేసులో నిందితులు అరెస్టు

image

హత్యాయత్నం కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు కలకడ SI రామాంజనేయులు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఈనెల 10న ముడియంవారిపల్లె, కొత్తపల్లెకు చెందిన ప్రవీణ్, అతని తండ్రి వెంకటరమణ, తల్లి సుబ్బమ్మపై ముడియంవారిపల్లి ప్రసాద్‌రెడ్డి, గంగిరెడ్డి, పుస్పావతి, శ్రీనివాసులురెడ్డి అతని అనుచరులు కొడవలితో నరికి హత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు. ఈ కేసులో నలుగురితో పాటు మైనర్లను అరెస్టు చేశామని తెలిపారు.

News September 17, 2025

ములుగు: పెద్దలను స్మరించుకునే ‘కొత్తల’ పండగ

image

ఆదివాసీల సంస్కృతి, ఆచార సంప్రదాయాలు విభిన్నమైనవి. ప్రకృతితో మమేకమై వారు జరుపుకొనే పండుగల్లో కొత్తల(పెద్దల)పండుగ ఒకటి. సెప్టెంబర్‌లో ఉత్తర కార్తె మొదటి పాదం ప్రారంభమైన తర్వాత బుధ, గురువారాల్లో నిర్వహిస్తారు. గ్రామ దేవతలకు కోడి, యాటపోతులు బలిచ్చి వనభోజనాలకు పోతారు. కొత్త ధాన్యాలు, సాక పోసి మొక్కుతారు. మరణించిన పెద్దలకు నైవేద్యం ఇస్తారు. నూతన వధూవరులకు తమ వంశంలో పూర్తి హక్కులు కల్పిస్తారు.