News April 4, 2024

BREAKING: పంజాబ్ టార్గెట్ 200 రన్స్

image

పంజాబ్‌తో మ్యాచులో గుజరాత్ 4 వికెట్లు కోల్పోయి 199 రన్స్ చేసింది. కెప్టెన్ గిల్ 89* పరుగులతో అదరగొట్టగా, సాయి సుదర్శన్ 33, విలియమ్సన్ 26, సాహా 11, విజయ్ శంకర్ 8, తెవాటియా 23* రన్స్ చేశారు. రబడ 2 వికెట్లు, హర్‌ప్రీత్ బార్, హర్షల్ పటేల్ చెరో వికెట్ తీశారు. విజయం కోసం పంజాబ్ 200 పరుగులు చేయాలి.

Similar News

News January 20, 2026

ఒకే రోజు రూ.22వేలు పెరిగిన వెండి ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వెండి ధర ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. ఇవాళ ఒక్కరోజే <<18903989>>కేజీ<<>> వెండిపై రూ.22వేలు పెరిగి రూ.3,40,000కు చేరింది. కేవలం 10 రోజుల్లోనే వెండి ధర రూ.65వేలు పెరిగి ఇన్వెస్టర్లకు భారీ లాభాలనిచ్చింది. అటు 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.2,130 పెరిగి రూ.1,48,370, 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,950 ఎగబాకి రూ.1,36,000 పలుకుతోంది.

News January 20, 2026

షుగర్ పేషంట్లకు ‘తీపి’ వార్త!

image

తీపి అంటే ఇష్టం ఉన్నా ఆరోగ్య సమస్యల వల్ల దూరంగా ఉండేవారికి శాస్త్రవేత్తలు గుడ్ న్యూస్ చెప్పారు. సూక్రోస్‌లోని 92% తియ్యదనం, అందులో 1/3 వంతే క్యాలరీలు ఉన్న ‘తగటోస్’(Tagatose) అనే కొత్త రకం షుగర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇది శరీరంలో ఇన్సులిన్ స్థాయులను పెంచదు. దీనివల్ల బరువు పెరుగుతామన్న భయం లేకుండా డయాబెటిస్ ఉన్నవారూ మధుర రుచిని ఆస్వాదించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

News January 20, 2026

NIT వరంగల్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

<>NIT <<>>వరంగల్ 39 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, బీఈ/బీటెక్, డిప్లొమా, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఇంటర్, టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు ఫిబ్రవరి 8 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1500, SC, ST, PwBDలకు రూ.1000. స్క్రీనింగ్/స్కిల్/ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://nitw.ac.in/